ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో, అలాగే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినప్పుడే మంచి బజ్ వచ్చింది.
అలాగే ఇటీవల విడుదలైన టీజర్ కూడా ఫన్నీగా ఉంటూ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసింది. నితిన్ కంప్లీట్ ఎంటర్టైనింగ్ రోల్ లో కనిపించబోతున్నాడు. బాహుబలి చిత్రంలో 6వ లైన్ లో 7వ వాడు ఎవడో తెలుసా అంటూ నితిన్ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 8న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నితిన్ ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు.
గత చిత్రాల పరాజయం కారణంగా ఈ ఎక్స్ట్రాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో చేసినట్లు నితిన్ తెలిపాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా శ్రీలీల పేరు వినిపిస్తోంది. స్టార్ హీరోలకు పోటీగా శ్రీలీల చిత్రాలు చేస్తోంది. అయితే ధమాకా, భగవంత్ కేసరి లాంటి హిట్స్ పడ్డాయి కానీ.. అదే స్థాయిలో ప్లాపులు కూడా ఎదురవుతున్నాయి.
స్కంద, ఆదికేశవ లాంటి ఫ్లాపులు కూడా ఎదురయ్యాయి. ఆదికేశవ చిత్రం అయితే వైష్ణవ్ తేజ్ కి కూడా పెద్ద తలనొప్పిలా మారిపోయింది. ఈ తరుణంలో వెంటనే శ్రీలీల నుంచి వస్తున్న చిత్రం నితిన్ ఎక్స్ట్రా. ఈ మూవీ తో అయినా ఆమెకి కాస్త రిలీఫ్ దక్కుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ నితిన్ రిలీజ్ కి ముందే శ్రీలీలకి షాకిచ్చే కామెంట్స్ చేశాడు.
Nithiin
ఎక్స్ట్రాలో శ్రీలీల పాత్ర పరమ రొటీన్ అన్నట్లుగా తేల్చేశాడు. అని కమర్షియల్ చిత్రాల్లో లాగే ఆమె పాటల్లో, కొన్ని సీన్స్ లో మాత్రమే కనిపిస్తుంది అన్నట్లుగా క్లారిటీ ఇచ్చేశాడు. ఈ చిత్రంలో ఫోకస్ మొత్తం తన పాత్రపైనే ఉంటుందని దర్శకుడు ఎలా డిజైన్ చేశారని నితిన్ పేర్కొన్నారు. అంటే ఎక్స్ట్రా మూవీలో కూడా శ్రీలీలకి అంత ఇంపార్టెన్స్ లేదని అర్థం అవుతోంది. అంటే మూవీ హిట్ అయినా ఆ క్రెడిట్ శ్రీలీలకి ఏమాత్రం దక్కేలా లేదు.
Pawan Kalyan
నితిన్ మరికొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశాడు. ప్రతి చిత్రంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ ని వాడేయడం గురించి ప్రశ్నించగా నితిన్ స్పందించాడు. నేను వాడడం ఏంటి.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని నేను. ఈ విషయం ఎప్పుడో చెప్పాను. నా కంటే పవన్ కళ్యాణ్ ని ఎక్కువగా వాడేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ వాళ్ళు బయటకి చెప్పుకోరు నేను చెప్పుకుంటాను అని నితిన్ క్లారిటీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ పేరు వాడుకుంటారు కానీ పాలిటిక్స్ లో మాత్రం ఆయనకి ఎవరూ మద్దతు తెలపరు కదా అని ప్రశ్నించగా.. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ప్రస్తుతం చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు. ఆయనకి మా సపోర్ట్ అవసరం లేదు. కానీ మోరల్ సపోర్ట్ ఉంటుందని నితిన్ తెలిపారు.