Bigg Boss Telugu 7
రతిక రోజ్ కి భయంకరమైన ఫేవర్ చేస్తున్నారని సోషల్ మీడియా టాక్. నాగార్జునతో పాటు నిర్వాహకులు హౌస్లోలోకి ఆమెను తెచ్చేందుకు, కొన్నాళ్ళు ఉంచేందుకు పక్షపాత నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాగార్జున మీద గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. గత సీజన్లో బాలాదిత్య చిన్న పొరపాటు చేసినా నాగార్జున క్లాస్ పీకేవాడు. అదే రేవంత్ విషయంలో సాఫ్ట్ గా ఉండేవాడు. రేవంత్ చివరికి కొందరిపై ఫిజికల్ అయ్యాడు. అది ఆటలో అగ్రెషన్ అని నాగార్జున వెనకేసుకొచ్చాడు.
Bigg Boss Telugu 7
అగ్రెషన్ చూపించి కాకపోతే... దెబ్బలు తగలకుండా చూసుకో అంటూ ఎల్లో కార్డు చూపించాడు. అదే పని గేమ్ లో భాగంగా టేస్టీ తేజ చేస్తే నాగార్జున పెద్ద పంచాయితీ పెట్టాడు. జైలుకి పంపడంతో పాటు ఒక వారం నేరుగా నామినేట్ చేశాడు. ఈ సీజన్లో కూడా నాగార్జున తీరు అలానే ఉందనిపిస్తుంది. రతిక రోజ్ ని హౌస్లోకి తేవడానికి చేయాల్సినవన్నీ చేశారు. దామిని, శుభశ్రీ, రతిక రోజ్ లలో ఒకరు రీ ఎంట్రీ ఇస్తారని నాగార్జున చెప్పాడు. హౌస్ మేట్స్ వారికి ఓటు వేయాలన్నాడు.
మీ ఓటింగ్ ఆధారంగా వీరిలో ఒకరు రీఎంట్రీ ఇస్తా అన్నాడు. ముగ్గురితో నాగార్జున క్యాంపైన్ కూడా చేయించాడు. ఓటు వేసి గెలిపించాలని హౌస్ మేట్స్ ని ఎవరికి వారు వేడుకున్నారు. కట్ చేస్తే ఓటింగ్ ముగిశాక... ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు కాదు తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లకు ఛాన్స్ అంటూ మాట మార్చారు. అంటే ఈ లోపు ఓట్లు లెక్క బెట్టి రతికకు తక్కువ ఓట్లు రావడంతో అప్పటికప్పుడు నిర్ణయం మార్చేశారని కొందరి వాదన.
Bigg Boss Telugu 7
శుభశ్రీ, దామిని, రతికలలో ఎవరు హౌస్లోకి రావాలనేది ప్రేక్షకులకు వదిలేయాల్సింది. అలా చేస్తే రతిక రాదు. రతిక రోజ్ కి అనుకూలంగా బిగ్ బాస్ తీసుకున్న మరొక నిర్ణయం.. ఈ వారం ఎలిమినేషన్ నుండి తప్పించడం. హౌస్ మేట్స్ కెప్టెన్ అర్జున్ తో పాటు, రతికను నామినేట్ చేయడానికి వీలు లేదన్నారు. రతిక హౌస్లో అడుగుపెట్టి ఒక్క రోజే కాబట్టి ఆమెను నామినేషన్స్ లో పెట్టలేదనేది బిగ్ బాస్ లాజిక్.
Bigg Boss Telugu 7
అలా అనుకుంటే వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన ఐదుగురిని ఎందుకు నామినేషన్స్ లో పెట్టారు. ఆదివారం వాళ్లు హౌస్లోకి వస్తే సోమవారం నామినేషన్స్ ఏమిటీ? నయని పావనికి జరిగింది అన్యాయం కదా?. ఇంకా రతిక నాలుగు వారాలు హౌస్లో ఉండి వెళ్ళింది. ఆమెను ఎలిమినేషన్ లో పెట్టినా నామినేట్ చేయడానికి కారణాలు ఉంటాయి. ఈ పరిణామాలు చూస్తుంటే రతిక రోజ్ కి నాగార్జున, బిగ్ బాస్ ఫుల్ ఫేవర్ చేస్తున్నారనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది...