యంగ్ బ్యూటీ రతికా రోజ్ (Rathika Rose) ప్రస్తుతం బిగ్ బాగ్ తెలుగు సీజన్ 7తో అలరిస్తోంది. బిగ్ బాస్ హైజ్ లో ఈ ముద్దుగుమ్మే గ్లామరస్ కంటెస్టెంట్. తన అందంతో టీవీ ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకుంటోంది. రెండోసారి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రతిక గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడుతోంది.
అయితే, ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌజ్ లోకి రావడానికి ముందు ఏం చేసేది.. ఆమె గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. రతికా బర్త్ డే మే 12. వికారాబాద్ జిల్లాలో జన్మించ్చింది. ఆమె తండ్రిపేరు రాములు యాదవ్, రైతు. తల్లి పేరు అనితా రాణి, లోకల్ పొలిటికల్ లీడర్.
రతికాకు ఓ చెళ్లి కూడా ఉంది. ఆమె పేరు కన్నా ప్రవలు. రతికా రోజ్ తన కెరీర్ ను నటిగా, మోడల్ గా ప్రారంభించింది. 2016లో తెలుగు కామెడీ షో ‘పటాస్’తో టీవీ ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. అప్పటికి ఇప్పటికి రతికాను చూస్తే చాలా ఛేంజ్ కనిపిస్తుంటుంది. ఏడేనిదేళ్లుగా కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది.
మోడల్ గా ఎన్నో కమర్షియల్ యాడ్స్ ల్లో నటించింది. ఫొటోషూట్లతో నూ ఆకట్టుకుంది. మరోవైపు రతికా టాక్స్ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా రన్ చేస్తూ వచ్చింది. తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండేది. అలాగే రీల్స్, లిపిక్ సింగ్ వీడియోలతోనూ ఆకట్టుకునేది.
2019తో స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సరసన ఓ తెలుగు మ్యూజిక్ వీడియో కూడా చేసింది. ‘హే పిల్లా’ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంది. పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది, మారూ, నారప్ప, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’, ‘నేను స్టూడెంట్ సార్’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్ తో అలరించింది.
ఈ ముద్దుగుమ్మ చదువులోనూ ముందంజలోనే ఉంది. రతికా బీటెక్ పూర్తి చేసింది. మల్లారెడ్డి ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనే చదువుకుంది. టెన్త్, ఇంటర్ గంగోత్రీ విద్యాలయ (రంగారెడ్డి), జవహర్ నవోదయ విద్యాలయ (గచ్చిబౌలి)లో పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక నటనపై ఆసక్తితో టీవీ రంగంలోకి అడుగుపెట్టింది.