బిగ్ బాస్ అర్జున్ కూతురికి గౌతమ్ సర్ప్రైజ్ గిఫ్ట్... ఇంతకీ ఏమిచ్చాడో తెలుసా?

First Published | Feb 16, 2024, 4:49 PM IST

బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్స్ అందరు బీబీ ఉత్సవం కోసం మరలా ఒక చోటికి చేరారు. కాగా అర్జున్ అంబటి ఇటీవల తండ్రి అయ్యాడు. అర్జున్ బిడ్డకు గౌతమ్ కృష్ణ సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. 
 

BB Utsavam

బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. మొదట 14 మంది తో షో మొదలైంది. అనంతరం మరో ఐదుగురి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. వారిలో అంబటి అర్జున్ ఒకడు. వైల్డ్ కార్డు ద్వారా షోకి వచ్చిన వాళ్లలో ఒక్కరు కూడా సక్సెస్ కాలేదు. అంబటి అర్జున్ మాత్రమే ఫైనల్ కి వెళ్ళాడు, అంబటి అర్జున్ 6వ స్థానంలో నిలిచాడు. 

BB Utsavam

అంబటి అర్జున్ హౌస్లో ఉన్నప్పుడు భార్య సురేఖ వచ్చింది. ఫ్యామిలీ వీక్ లో భర్తను కలిసేందుకు ఆమె వచ్చారు. సురేఖ అప్పటికి గర్భవతి. దీంతో బిగ్ బాస్ హౌస్ లోనే ఆమెకు సీమంతం జరిగింది. బిగ్ బాస్ ఆ ఏర్పాట్లు చేశాడు. 
 


BB Utsavam


కాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ స్టార్ మా ఒక చోటికి చేర్చింది. బీబీ ఉత్సవం షో పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఈ షోలో అందరూ పాల్గొన్నారు. ఆటలు, పాటలతో ప్రేక్షకులను అలరించారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. 
 

BB Utsavam


అర్జున్ అంబటి ఇటీవల తండ్రి అయ్యాడు. భార్య సురేఖ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో గౌతమ్ కృష్ణ అర్జున్ కూతురికి గిఫ్ట్ తెచ్చాడు. పాపకు వెండి పట్టీలు తెచ్చాడు. బీబీ ఉత్సవం వేడుకపై ఈ గిఫ్ట్ అర్జున్ కి అందజేశాడు. 

BB Utsavam

పుట్టిన వెంటనే మొదట నా చెట్టులోకి తీసుకున్నాను. నా కూతురు పుట్టినప్పుడే పెద్దకళ్ళు చేసి నన్ను చూసింది. తనకు ఏ బాధ కలగకుండా చూసుకుంటాను... అని అర్జున్ అన్నాడు. అర్జున్ కూతురికి గౌతమ్ గిఫ్ట్ ఇవ్వడం ఆసక్తి రేపింది. 

Latest Videos

click me!