కావ్య థాపర్ రీసెంట్ గా రవితేజ సరసన ఈగల్ చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ కావ్య థాపర్ కి మాత్రం ఈ చిత్రంలో మంచి రోల్ దక్కింది. ఆమె నటన కూడా అద్భుతంగా ఉంది. సినిమా నిరాశ పరిచినప్పటికీ కావ్యకి మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి.