కెప్టెన్ గా హౌస్ ని ఏలాలన్న నా కోరిక తీరకుండానే ఎలిమినేట్ అయ్యానని అంటే... నువ్వు 9 వారాలు హౌస్ ని పాలించావని నాగార్జున అన్నారు. ఇవేమీ చూపించలేదని గీతూ చెప్పి ఆవేదన చెందింది. ఆమె మాటలు పరిశీలిస్తే నాగార్జున, బిగ్ బాస్ లదే తప్పు అన్నట్లుగా ఉంది. తనను అతిగా పొగిడి తప్పుదోవ పట్టించారు అన్నట్లు ఉంది. పరోక్షంగా తన ఎలిమినేషన్ కి వాళ్ళను బాద్యులు చేసింది.