ప్రభాస్‌ని అందరి ముందే అన్నా అని పిలిచిన యంగ్‌ హీరోయిన్‌.. గోల చేస్తున్న డార్లింగ్‌ ఫ్యాన్స్

Published : Oct 30, 2022, 07:37 PM IST

ప్రభాస్‌ టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌. నాలుగు పదులు దాటినా ఇంకా మ్యారేజ్‌ కాలేదు. వేలాది మంది అమ్మాయిల దోచుకున్న సూపర్‌ స్టార్‌. కానీ ఓ హీరోయిన్‌ మాత్రం ఆయన్ని అన్నా అని పిలవడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

PREV
15
ప్రభాస్‌ని అందరి ముందే అన్నా అని పిలిచిన యంగ్‌ హీరోయిన్‌.. గోల చేస్తున్న డార్లింగ్‌ ఫ్యాన్స్

ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాలు విజయాలు సాధిస్తే గ్లోబల్‌ స్టార్‌గా మారిపోతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రభాస్‌ ప్రస్తుత ఏజ్‌ 43ఏళ్లు. ఇప్పటికీ ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనేది క్లారిటీ లేదు. అసలు డార్లింగ్ కి మ్యారేజ్‌ చేసుకునే ఉద్దేశ్యం ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 
 

25

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ యంగ్‌ హీరోయిన్‌ ప్రభాస్‌కి పెద్ద షాకిచ్చింది. ఆయన అభిమానులను గట్టిగా హర్ట్ చేసింది. ఆమె ఎవరో కాదు, జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా కావడం విశేషం. ఆమె ప్రస్తుతం `లైక్‌ షేర్‌ సబ్‌స్క్రైబ్‌` చిత్రంలో నటిస్తుంది. సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన చిత్రమిది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్‌ 4న విడుదల కానుంది. శనివారం సాయంత్రం చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. నాని గెస్ట్ గా హాజరయ్యారు. 
 

35

ఇందులో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ, `ప్రభాస్‌ అన్నా` అంటూ సంభోదించింది. `జాతిరత్నాలు` సినిమా ట్రైలర్‌ని ప్రభాస్‌ అన్నానే విడుదల చేశాడు. అది పెద్ద హిట్‌ అయ్యిందని, ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్‌ని కూడా ఆయనే రిలీజ్‌ చేశాడని, ఈ సినిమా కూడా హిట్‌ అవుతుందని ఆమె తెలిపింది. 

45

ఇక్కడే డార్లింగ్‌ ఫ్యాన్స్ గోలెత్తిపోతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ని పట్టుకుని అన్నా అని పిలిచిందేంటంటూ వాళ్లు గోల చేస్తున్నారు. అమ్మాయిలకే కాదు, ఎంతో మంది హీరోయిన్లకి క్రష్‌లాంటి ప్రభాస్‌ని అన్నా అని పిలిస్తే, మిగిలిన హీరోయిన్లు కూడా అదే ఫాలో అయిపోతే డార్లింగ్‌ పరిస్థితేంటంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. `వామ్మో అన్నా అనేసిందరా అంటూ కామెంట్లతో వైరల్‌ చేస్తున్నారు. 
 

55

దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ప్రభాస్‌ మ్యారేజ్‌ చేసుకోరా? హీరోయిన్లకి అన్నాగా మారిపోతారా? లేక ఇక మ్యారేజ్‌ చేసుకోడులే అని ప్రభాస్‌ని అన్నగా మార్చుకుంటున్నారా? అనే మీమ్స్ తో వైరల్‌ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఇప్పుడు `ప్రభాస్‌ అన్నా` అనేది సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. మరి ఇది ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories