Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్

Published : Oct 08, 2026, 11:17 PM IST

బిగ్ బాస్ హౌస్ లో గురువారం రోజు లీడర్ బోర్డు టాస్కులు చాలా సరదాగా సాగాయి. బోర్డు లో అత్యధిక పాయింట్స్ సాధించిన అమన్, త్రిగున్ ఇమ్యూనిటీ పొందారు. నరేష్, రామ్ ప్రసాద్ కూడా అనూహ్యంగా ముందుకు దూసుకువచ్చారు.

PREV
14
Bigg Boss Telugu 10

బిగ్ బాస్ హౌస్ లో 32వ రోజు టాస్కులు చాలా సరదాగా సాగాయి. లీడర్ బోర్డులో అమన్, త్రిగుణ్ అత్యధిక పాయింట్స్ సాధించి సేఫ్ జోన్ లోకి వెళ్లారు. ఇమ్యూనిటీ సాధించారు. ఈ రోజు జరిగిన మొదటి టాస్క్ లో అమన్ విజయం సాధించాడు. దీనితో అమన్, త్రిగుణ్ పెయిర్ కి లీడర్ బోర్డు లో పాయింట్స్ యాడ్ అయ్యాయి. రెండవ స్థానంలో రామ్ ప్రసాద్, మూడవ స్థానంలో ముఖేష్, నాల్గవ స్థానంలో షాలిని, ఐదవ స్థానంలో అపూర్వ నిలిచారు.

24
చిత్రం భళారే విచిత్రం టాస్క్

ఆ తర్వాత చిత్రం భళారే విచిత్రం అనే టాస్క్ జరిగింది. ఈ టాస్క్ కి అమన్, త్రిగున్, సంచాలక్ గా వ్యవహరించారు. ఈ టాస్క్ ప్రకారం తమ పెయిర్ లోని ఒక సభ్యులు సంచాలక్ చెప్పిన బొమ్మని బోర్డులో గీయాలి. ప్రతి పెయిర్ నుంచి ఒకరు బొమ్మ గీస్తారు. బొమ్మ గీయడం అయ్యాక ఆ పెయిర్ లోని రెండవ సభ్యుడు వచ్చి బోర్డుని గమనించాలి. సంచాలక్ ఏ బొమ్మ నంబర్ చెబితే వాళ్ళు సరిగ్గా అదే బొమ్మని కనిపెట్టి తీసుకుని రావాలి. కరెక్ట్ గా తెచ్చిన వారికి పాయింట్స్ యాడ్ అవుతాయి.

34
త్రిగుణ్ తో షాలిని గొడవ

ఈ టాస్క్ చాలా సరదాగా సాగింది. నరేష్ బొమ్మ సరిగ్గా గీయలేకపోయాడు. అయినప్పటికీ రామ్ ప్రసాద్ అర్థం చేసుకుని టాస్క్ ఆడాడు. ఝాన్సీ, ముకేశ్ ఒక పెయిర్ కాబట్టి.. తాను ఏ బొమ్మ గీశాను అనేది ఝాన్సీ ముఖేష్ కి హింట్ ఇవ్వడానికి ప్రయత్నించింది. షాలిని కూడా రోహిత్ తో ఏదో మాట్లాడబోయింది. దీనితో ఆ రెండు జంటలని త్రిగుణ్ రెండు రౌండ్ల పాటు అనర్హులుగా ప్రకటించాడు. ఇది కాసేపు వివాదం అయింది. తాను ఏ తప్పు చేయలేదు అని షాలిని త్రిగుణ్ తో గొడవ పడింది.

44
నరేష్, రామ్ ప్రసాద్ విజయం

ఫైనల్ గా ఈ టాస్క్ లో నరేష్, రామ్ ప్రసాద్ విజయం సాధించారు. దీనితో రామ్ ప్రసాద్, నరేష్ లీడర్ బోర్డు లో రెండవ స్థానానికి చేరుకున్నారు. వాళ్ళకి ప్రస్తుతం 220 పాయింట్స్ ఉన్నాయి. షాలిని, రోహిత్ అతి తక్కువగా 140 పాయింట్స్ తో బాటమ్ లో ఉన్నారు. అంతకు ముందు ఇంటి సభ్యులంతా స్విమ్మింగ్ పూల్ లోకి దూకి డ్యాన్స్ చేస్తూ చిల్ అయ్యారు. ఈ క్రమంలో ముకేశ్, వర్షిణి.. రోహిత్, షాలిని రొమాంటిక్ డ్యాన్స్ కూడా చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories