Bigg Boss Shalini: దుమ్ము దులిపేసిన నాగార్జున, షాలినికి ఫ్యూజులు అవుట్..మోకాళ్లపై నిల్చుని బతిమాలిన రోహిత్

Published : Oct 24, 2026, 11:42 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో భాగంగా శనివారం ఎపిసోడ్ వాడీవేడీగా సాగింది. నాగార్జున ఇచ్చిన కోటింగ్ కి ఒక్కొక్కరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
15
Bigg Boss Telugu 10

బిగ్ బాస్ షోలో 48వ రోజు శనివారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు చుక్కలు కనిపించాయి. ఆ రేంజ్ లో నాగార్జున ఒక్కొక్కరికి కోటింగ్ ఇచ్చారు. ముఖ్యంగా షాలిని, త్రిగుణ్, రోహిత్ లకు ఫ్యూజులు ఎగిరిపోయేలా నాగార్జున క్లాస్ పీకారు. సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒక్కొక్కరి బాక్సులు బద్దలు కొడుతూ చేసిన తప్పుల గురించి నిలదీశారు. ముందుగా గేమ్ బాగా ఆడిన నరేష్, శివ కుమార్, నీతూ, అమన్ లని నాగార్జున అభినందించారు.

25
నువ్వేం పీకావు అని అడిగావు కదా..

ఆ తర్వాత అసలు కథ మొదలైంది. క్లాస్ పీకడం నాగార్జున ముకేశ్ తో ప్రారంభించారు. శివ కుమార్ విషయంలో ముకేశ్ సిగ్గు లేదా అటూ ప్రవర్తించిన విధానం ఏమాత్రం బాగాలేదని నాగార్జున అన్నారు. అసలు శివ కుమార్ పర్సనల్ విషయాలు నీకు ఎందుకు ? అదే విధంగా నీతూ విషయంలో కూడా తప్పుగా బిహేవ్ చేశావ్ అని నాగార్జున అడిగారు. ఇదే బిహేవియర్ కొనసాగిస్తే నీ పతనం మొదలవుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు. వర్షిణికి కూడా కౌంటర్లు బాగానే పడ్డాయి. నీతూని ఏం పీకావు అని అడిగావు కదా ఆమె పీకి చూపించింది. నువ్వేం చేశావ్.. కనీసం 12 కేజీల బరువు కూడా మోయలేకపోయావ్ అంటూ నాగార్జున సెటైర్లు వేశారు.

35
షాలిని తిరిగి రావడం ఇష్టం లేదు

ఆ తర్వాత షాలిని గురించి చర్చ మొదలైంది. షాలిని హౌస్ లోకి తిరిగి రావడం నీకు ఇష్టమేనా అని నాగార్జున రామ్ ప్రసాద్ ని ప్రశ్నించారు. దీనికి రామ్ ప్రసాద్ ఇష్టం లేదు అని సమాధానం ఇచ్చారు. ఆమెకి రెండవసారి ఛాన్స్ వచ్చాక కూడా ఇంప్రూవ్ మెంట్ కనిపించలేదు అని రామ్ ప్రసాద్ తెలిపారు. బ్రేక్ టైంలో షాలిని రామ్ ప్రసాద్ మాటలకు వెక్కి వెక్కి ఏడ్చేసింది. ప్రతి ఒక్కరూ నన్నే పాయింట్ చేస్తున్నారు. నాకు హౌస్ లో ఉండాలని లేదు అంటూ ఏడ్చేసింది. దీనితో రోహిత్, స్వేతా ఆమెని ఓదార్చే ప్రయత్నం చేశారు.

45
హౌస్ నుంచి వెళ్ళిపోతా, నాగార్జునతో షాలిని

ఆ తర్వాత నాగార్జున ఎందుకు ఏడ్చావు అని షాలిని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ తననే పాయింట్ అవుట్ చేస్తున్నారు అని షాలిని తెలిపింది. అంతే కానీ నీ తప్పు ఏమీ లేదా ? అయితే ఈ వీడియో చూడు అంటూ నాగార్జున ఆమెకి దక్షితో గొడవ, దేబ్జానీతో వివాదం, బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడం లాంటి సంఘటనలని చూపించారు. బిగ్ బాస్ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నీలో ఏమాత్రం మార్పు లేదు. ఆ బిహేవియర్ ఏంటి అని నాగ్ సీరియస్ అయ్యారు. ఒక రేంజ్ లో క్లాస్ పీకారు. నా తప్పు ఉంటే నేను హౌస్ నుంచి వెళ్ళిపోతాను అని షాలిని ఏడుస్తూ చెప్పింది. అయితే వెళ్ళిపో అంటూ నాగార్జున హౌస్ గేట్స్ ఓపెన్ చేయించారు. వెళ్లిపోవడానికి షాలిని రెడీ అయింది. కానీ రోహిత్, మరికొందరు ఆమెని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు.

55
రోహిత్ కి ఊహించని శిక్ష

నువ్వు వెళ్ళిపోతే తప్పు నీదే అవుతుంది. ఇక్కడే ఉండి ప్రూవ్ చేయాలి అని రోహిత్ కన్విన్స్ చేశాడు. దీనితో షాలిని తన నిర్ణయం మార్చుకుంది. ఇలాంటి తప్పులు ఇక రిపీట్ చేయనని నాగార్జునకు సారీ చెప్పింది. రోహిత్ విషయంలో చచ్చిపో, ఏరా, పోరా అంటూ నోరు జారిన త్రిగుణ్ కి కూడా నాగార్జున గట్టిగా ఇచ్చి పడేశారు. అంతే కాదు ఈ రోజు నుంచి త్రిగుణ్ కి జైలు శిక్ష అని నాగార్జున ప్రకటించారు. ఆ తర్వాత రోహిత్ కి చుక్కలు కనిపించాయి. రోహిత్ బ్యాడ్ బిహేవియర్ కారణంగా అతడికి నాగార్జున బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. ఎన్నిసార్లు చెప్పిన చీప్ బిహేవియర్, వల్గర్ మాటలు మాట్లాడడం మానడం లేదు. అందుకే హౌస్ లో ఉన్నన్ని రోజులు నీకు కెప్టెన్ అయ్యే అవకాశాన్ని, కెప్టెన్సీ కంటెండర్ గా పోటీ చేసే అవకాశాన్ని రద్దు చేస్తున్నా అని తెలిపారు. దీనితో రోహిత్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. మోకాళ్లపై నిలబడి బతిమాలాడు. ఇలా అయితే నా గేమ్ మొత్తం దెబ్బ తింటుంది. దయచేసి ఆ శిక్ష వద్దు సార్ అని అడిగాడు. దీనితో నాగార్జున ఇంటి సభ్యుల నిర్ణయం అడిగి ఆ శిక్షని 2 వారాలకు తగ్గించారు.

Read more Photos on
click me!

Recommended Stories