Bigg Boss Telugu 10 Grand Launch: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?

Published : Sep 06, 2026, 04:52 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ని చూపించారు నాగార్జున. ఈ సారి హౌజ్‌ సరికొత్తగా ఉంది. కొత్త కాన్సెప్ట్ తో డిజైన్‌ చేశారు. ఒక మ్యాజికల్‌ రూమ్‌ ఉంది. అదే సమయంలో మ్యాజికల్‌ కీ ఉంది.

PREV
18
గ్రాండ్‌గా బిగ్‌ బాస్‌ తెలుగు 10 ప్రారంభం

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభం కాబోతుంది. బిగ్‌ బాస్‌ తెలుగు 10 దశావతారం పేరుతో ఇది కాసేపట్లోనే స్టార్ట్ కానుంది. దాదాపు 16 మంది కంటెస్టెంట్లతో ఈ సీజన్‌ ప్రారంభం కాబోతుందట. మధ్యలో మరో ఐదుగురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారని సమాచారం. ఇక నాగార్జున హోస్ట్ గా ఈ షో రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. గత ఏడు సీజన్లకి నాగ్‌ హోస్ట్ గా చేశారు. ఇప్పుడు కూడా ఆయన చేస్తున్నారు. బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి 10 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. గ్రాండ్‌ లాంచ్‌ ఈవెంట్‌కి సంబంధించి తాజాగా ప్రోమో వచ్చింది. ఇందులో బిగ్‌ బాస్‌ హౌజ్‌ని చూపించారు. ఇది సరికొత్తగా ఉంది.

28
బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ స్పెషాలిటీ

బిగ్‌ బాస్‌ హౌజ్‌ కామన్‌గా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అయితే ఈ సారి మామూలు కలర్‌పుల్‌ కాదు, 10ఎక్స్ అనేలా ఉంది. విజువల్స్ ట్రీట్‌ లా ఉంది. అదే సమయంలో కొత్త కాన్సెప్ట్ లో ఈ హౌజ్‌ని డిజైన్‌ చేసినట్టు ఉంది. హౌజ్‌ గార్డెన్‌ ఏరియాలో బిగ్‌ బాస్‌ భారీ అక్షరాలతో ఉంది. అందులో ఒక కాన్సెప్ట్ కనిపిస్తోంది. రోబో ఈ హౌజ్‌ని పరిచయం చేయడం విశేషం. దాని పేరు మిస్టర్‌ హాయ్‌. ఇందులో నాగార్జున వెళ్లి హౌజ్‌ని చూపించారు. ఆ కొత్త దనం చూసి ఆయన కూడా సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఓపెనంగ్‌ గేట్ భారీగా ఉంది. అది బీ అక్షరంలోనుంచి ఉండటం విశేషం. గార్డెనింగ్‌ ఏరియా విశాలంగా, అదిరిపోయేలా ఉంది.

38
కలర్‌ ఫుల్‌గా బిగ్‌ బాస్‌ హౌజ్‌

ఈ ఇంట్లో కావాల్సింది తెలివితేటలు, లెక్కలు కాదు, ఎమోషన్స్ తో అల్లుకున్న చిక్కులు అని నాగార్జున చెప్పారు. కిచెన్‌, డైనింగ్‌ టేబుల్‌, రిలాక్స్ ఏరియా చాలా లావిష్‌గా ఉంది. చాలా పెద్దగా ఉంది. అదే సమయంలో చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇక బెడ్‌ రూమ్‌ ఏరియా కూడా ఫ్రీగా ఉంది. బెడ్స్ కలర్స్ కొత్తగా ఉన్నాయి, ఎల్లో కలర్‌ని మెయింటేన్‌ చేశారు. నాలుగు భారీ బెడ్స్ కనిపించాయి.

48
బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మ్యాజికల్‌ రూమ్‌

అలాగే గ్రీనరీతో, పూల అలంకరణలతో ఓ స్పెషల్‌ రూమ్‌ ఉంది. అది చాలా పెద్దగా ఉంది. చూడబోతుంటే, రిలాక్స్ ఏరియాలా ఉంది. సరదాగా చర్చించుకునే పాయింట్‌గా కనిపిస్తుంది. కానీ హిందీ బిగ్‌ బాస్‌ హౌజ్ లో ఇలాంటి థీమ్‌ కనిపిస్తుంది. ఇప్పుడు తెలుగులో దీన్ని అలా డిజైన్‌ చేయడం విశేషం. ఇది సరికొత్త ఉంది. ఇంట్రెస్ట్‌ ని క్రియేట్‌ చేస్తుంది. ఈ గది గురించి నాగార్జున చెబుతూ, ఇదొక మ్యాజికల్‌.. ఇలాంటి కాన్సెప్ట్ తాను చేసిన ఏ సీజన్‌లోనూ చూడలేదని చెప్పడం విశేషం.

58
10 టైమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్

ఇక ఈ సారి బిగ్‌ బాస్‌ షో ఎలా ఉండబోతుందో నాగార్జున చెప్పారు. పది టైమ్స్ ట్విస్ట్ లు, 10 టైమ్స్ పవర్స్, 10 టైమ్స్ సవాళ్లు అలాగే, 10 టైమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందట. ఇందులో ప్రారంభంలో పది రకాల పవర్స్ ఇస్తున్నారు నాగార్జున. వాటిని ఎవరు గెలుచుకుంటారు? ఆ పవర్స్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

68
ఒకే స్టేజ్‌పై నలుగురు హోస్ట్ (సూపర్‌ స్టార్లు)లు

ఇందులో మరో విశేషం ఏంటంటే.. సౌత్‌లో నాల్గు భాషల్లో ఈ బిగ్‌ బాస్‌ షో రన్‌ అవుతుంది. అయితే ఒకేసారి నాలుగు హోస్ట్ లు నాగార్జున, మలయాళం నుంచి మోహన్‌ లాల్‌, కన్నడ నుంచి సుదీప్‌, తమిళం నుంచి విజయ్‌ సేతుపతి ఇలా ఒకేసారి వీడియో మీట్‌ ద్వారా కలుసుకోవడం విశేషం. నలుగురు హాయ్‌ చెప్పుకున్నారు. ఆనందాలను పంచుకున్నారు. దీంతోపాటు నాగార్జున ఒక కీని పరిచయం చేశారు. కంటెస్టెంట్ల తలరాతలను మార్చే మ్యాజికల్‌ కీ అని, అది 10 పవర్స్ ఇస్తుందని, దాన్ని గెలుచుకున్న వారికి ఆ పవర్స్ లభిస్తాయని చెప్పారు.

78
బిగ్‌ బాస్‌ హౌజ్‌లో స్పెషల్‌ కన్ను

ఫైనల్‌గా హౌజ్‌లో ఒక సీక్రెట్‌ ఐ(కన్ను)ని చూపించారు నాగార్జున. చాలా పెద్ద ఐ అది. ఇది ఆడియెన్స్ నుంచి, హౌజ్‌ నుంచి, తన నుంచి ఈ ఐ హౌజ్‌ని చూస్తుందని తెలిపారు. నేడు సెప్టెంబర్‌ 6న ప్రారంభమైన ఈ షో సుమారు రూ.105 రోజులపాటు రన్‌ అవుతుంది. మరి ఈ సారి టైటిల్‌ విన్నర్‌గా సెలబ్రిటీలు నిలుస్తారా? కామనర్‌ నిలుస్తారా అనేది తెలియాల్సి ఉంది.

88
బిగ్‌ బాస్‌ షో ప్రసారం టైమింగ్స్

ఈ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30గంటలకు స్టార్‌ మాలో ప్రసారం అవుతుంది. శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. అలాగే జియో హాట్‌ స్టార్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories