Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ

Published : Sep 06, 2026, 10:35 PM IST

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా, కమెడియన్‌గా, హీరోగా మెప్పించిన కృష్ణుడు ఇప్పుడు బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెట్టారు. మరి ఆయన నేపథ్యంలో, ఆయన నటించిన సినిమాలేంటో తెలుసుకుందాం.

PREV
16
బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి కృష్ణుడు

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి మరో ఆసక్తికరమైన కంటెస్టెంట్‌గా నటుడు కృష్ణుడు అడుగుపెట్టారు. చాలా కాలంగా తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడికి ఇటీవల కాలంలో పెద్దగా సినిమాలు లేవు. బిగ్‌ స్క్రీన్‌ పై చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ షో ద్వారా తానేంటో చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. మరి బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి కంటెస్టెంట్ గా అడుగుపెడుతున్న నటుడు కృష్ణుడు బ్యాక్‌ గ్రౌండ్‌ విశేషాలు చూస్తే.

26
కృష్ణుడు బ్యాక్‌ గ్రౌండ్‌

కృష్ణుడు అసలు పేరు అల్లూరి కృష్ణ. 1975 జూలై 15న ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపల్లిలో జన్మించారు. ఆయనది రైతు కుటుంబ నేపథ్యం. మధ్యతరగతి కుటుంబ పరిస్థితుల మధ్య పెరిగిన కృష్ణుడికి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. అయితే నేరుగా హీరోగా ఇండస్ట్రీలోకి రాకుండా ఎన్నో కష్టాలు దాటుకుంటూ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

36
ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ లో విద్య

కృష్ణుడు చదువులోనూ మంచి టాలెంటెడ్‌. ఆయన బెంగళూరులో ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక సినిమాల్లోకి రావాలనే కోరికతో హైదరాబాద్‌ వచ్చారు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ చేశాడు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు, ఫోటోగ్రఫీ కూడా చేశాడు. హీరో కావాలనే కలలు కన్నాడు. కానీ ఒక్క యాక్సిడెంట్‌ ఆయన జీవితాన్నే మార్చేసింది. దీంతో హీరోకాబోయే వినాయకుడిగా మారిపోయినట్టు తెలిపారు. కాలికి గాయం కావడంతో బరువు పెరిగి దాదాపు రెండేళ్లపాటు కదలలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ముంబైలో ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. 1999లో హైదరాబాద్‌లో ‘ది ఫేసెస్‌’ పేరుతో ఫొటో స్టూడియోను కూడా ప్రారంభించారు.

సినిమాల్లోకి ఎంట్రీ

సినిమాలపై ఉన్న ఆసక్తితో కృష్ణుడు తొలుత కెమెరా వెనుక కూడా పనిచేశారు. ‘భగీరథ’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నటుడిగా అవకాశాలు అందుకున్నారు. 2005లో వచ్చిన `మొదటి సినిమా`తో నటుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ‘మనోడు’, ‘వీధి’, ‘షాక్‌’, ‘పార్టీ’, ‘పోకిరి’ వంటి సినిమాల్లో క్యారెక్టర్స్ చేశారు.

46
`హ్యాపీడేస్‌`తో పాపులర్‌.. వినాయకుడిలో హీరోగా..

కృష్ణుడి కెరీర్‌లో ‘హ్యాపీ డేస్‌’ కీలక మలుపుగా నిలిచింది. ఈ సినిమాలో బండోడు పాత్రలో కనిపించి యూత్‌కు దగ్గరయ్యారు. కానీ తెలుగు బాషలో తనకు నచ్చని ఒకే ఒక్క పదం బండోడు అని చెప్పి ఆశ్చర్యపరిచారు. ‘వాన’, ‘యువత’, ‘ఓయ్‌!’, ‘ఆర్య 2’, ‘ఏ మాయ చేసావే’, ‘మిస్టర్‌ పర్ఫెక్ట్‌’, ‘మనమ్‌’, ‘గోపాల గోపాల’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే కృష్ణుడికి హీరోగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం ‘వినాయకుడు’. ఈ చిత్రంలో కార్తీక్‌ అనే హీరో పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ‘విల్లేజీలో వినాయకుడు’లోనూ అదే పాత్రను కొనసాగించారు. హీరో కావాలనే కోరిక మొత్తానికి ఇలా తీరిందని చెప్పొచ్చు.

56
అవకాశాలు దూరమవ్వడంతో

కృష్ణుడు గత కొన్నేళ్లుగా సినిమాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ అడపాదడపా కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ‘వేట్టయన్‌’, ‘లగ్గం’, ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘షణ్ముఖ’ వంటి చిత్రాల్లో నటించారు. ఇలా హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మూడు రకాల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించిన కృష్ణుడు.. ఇప్పుడు బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి అడుగుపెట్టారు. దాదాపు రెండు దశాబ్దాల సినీ అనుభవం ఉన్న ఆయన హౌస్‌లో ఎలాంటి గేమ్‌ ఆడతారు? అనేది చూడాలి.

66
కృష్ణుడు కమ్‌బ్యాక్‌ కాదు, ఇదొక స్టేట్‌మెంట్‌

బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టే క్రమంలో కృష్ణుడు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను లావు కావడంతో పెళ్లి కూడా కష్టం అన్నారట. కానీ తనని అర్థం చేసుకునే అమ్మాయి వచ్చిందని తన భార్య గాయత్రిని పరిచయం చేశారు. ఆమె తనకు సపోర్ట్ గా ఉందన్నారు. ఇటీవల పదేళ్లు సినిమాకు గ్యాప్‌ వచ్చిందని, కానీ తన కూతురుతో టైమ్‌ స్పెండ్‌ చేసే అవకాశం వచ్చిందన్నారు. చాలా నేర్చుకున్నట్టు తెలిపారు. ఇప్పుడు కృష్ణుడు కమ్‌ బ్యాక్‌ కాదు, ఇదొక స్టేట్‌మెంట్‌ అని చెప్పి ఆశ్చర్యపరిచారు. హౌజ్‌లో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అవన్నీ ఆవిష్కరించబోతున్నట్టు తెలిపారు కృష్ణుడు. మరి ఎంత వరకు మెప్పిస్తారనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories