బిగ్ బాస్ తెలుగు 10 ఏడో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది తేలిపోయింది. ఏడో వారంలో రోహిత్, త్రిగుణ్, రామకృష్ణ, అమన్, స్వేతా నాయుడు, వర్షిణి, టెంపర్ వంశీ, సుధీర్, ఝాన్సీ, శివ, దక్షి, నీతూ మాస్టర్ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ ప్రకారం రోహిత్, త్రిగుణ్, అమన్, రామకృష్ణ టాప్‌లో ఉన్నారు. వీరితోపాటు సింగర్ ఝాన్సీ, టెంపర్ వంశీ, వర్షిణి, సుధీర్ లకు కూడా మంచి ఓటింగ్ పడుతోంది.