Charan Eliminate: బిగ్ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. చరణ్‌ ఎలిమినేట్‌

Published : Oct 10, 2026, 09:34 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్ ఎలిమినేషన్‌ చోటు చేసుకుంది. ఇప్పటికే అపూర్వ ఎలిమినేట్‌ అయినట్టు తెలిపింది. ఇక ఇప్పుడు చరణ్‌ కూడా ఎలిమినేట్‌ అయ్యాడట.

PREV
13
ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 10 రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఐదో వారంలో ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ ఉంటున్నాయి. ఈ క్రమంలో ఈ వారంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎలిమినేషన్‌కి సంబంధించిన ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ఈ వారంలో నామినేషన్‌లో షాలిని, నరేష్‌, చరణ్‌, రోహిత్‌, ముఖేష్‌, అపూర్వ ఉన్నారు. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉందట. ఇప్పటికే అపూర్వ ఎలిమినేట్‌ అయ్యిందని తెలిసింది.

23
చరణ్‌ ఎలిమినేట్‌

ఇప్పుడు మరో షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని, అందులో భాగంగా చరణ్‌ ఎలిమినేట్‌ అయ్యాడని తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన సమాచారం. బయటకు వచ్చింది. వైల్డ్ కార్డ్ ఉన్న నేపథ్యంలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌ నిర్వహించారు. అందులో భాగంగా అపూర్వతోపాటు చరణ్‌ కూడా ఎలిమినేట్‌ అయినట్టు తెలుస్తోంది. అయితే మొదటి వారంలోనే ఎలిమినేట్‌ అయ్యాడు చరణ్. మూడో వారంలో మళ్లీ తీసుకొచ్చారు. కానీ ఆయనలో పెద్దగా మార్పు లేదు. ఆట తీరు మారలేదు. పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు. అందులో భాగంగానే ఇప్పుడు ఐదో వారంలో డబుల్‌ ఎలిమినేషన్‌లో భాగంగా ఆయన్ని ఇంటికి పంపించారట.

33
ఐదో వారం చరణ్‌, అపూర్వ ఔట్‌

ఐదో వారంలో అపూర్వతోపాటు చరణ్‌ ఎలిమినేట్‌ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్‌ జరుగుతుంది. అందులో భాగంగా ఈ సమాచారం లీక్‌ అయ్యింది. ఇది ఆదివారం టెలికాస్ట్ కాబోతుంది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించి షూటింగ్‌ కూడా జరిగింది. ఐదుగురు కంటెస్టెంట్లు హౌజ్‌లోకి రాబోతున్నారు. వారిలో రామకృష్ణ, శివకుమార్‌, స్వేత నాయుడు, దక్షి, నీతూ నటరాజ్‌ రాబోతున్నారట. మరి వీళ్లు ఎంత వరకు మెప్పిస్తారు. కంటెంట్‌ ఇస్తారో చూడాలి.

అపూర్వ, చరణ్‌ ఎలిమినేట్‌ అయితే హౌజ్‌లో రామ్‌ ప్రసాద్‌, నరేష్‌, దేబ్జానీ, టెంపర్‌ వంశీ, ముఖేష్‌ గౌడ, సుధీర్‌ రెడ్డి, రోహిత్‌, అమన్‌, త్రిగుణ్‌, సింగర్‌ ఝాన్సీ, షాలిని, వర్షిణి ఉంటారు. వీరికి ఇప్పుడు కొత్తగా రాబోతున్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు యాడ్ అవుతారు. ఇప్పటికే హౌజ్‌ నుంచి శ్రష్టి, మిథిలేష్‌, కృష్ణుడు, చైత్ర రాయ్‌ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories