మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇంతలో రాంచరణ్ మరో క్రేజీ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. గేమ్ ఛేంజర్ తర్వాత రాంచరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో నటించేందుకు ఒకే చెప్పిన సంగతి తెలిసిందే.
#RC16
ఈ మూవీపై రాంచరణ్, బుచ్చిబాబు ఇద్దరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇదివరకే ఈ చిత్రానికి ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా ఉన్నాయి. రా అండ్ రస్టిక్ కంటెంట్ తో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రాంచరణ్ ఈ చిత్రంలో ఉత్తరాంధ్ర మాండలీకంలో డైలాగులు చెప్పబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
రాంచరణ్, బుచ్చిబాబు చిత్రానికి సంబంధించిన షాకింగ్ విషయాలని బిగ్ బాస్ సోహైల్ లీక్ చేశాడు. సోహైల్ కి రాంచరణ్ సినిమా సంగతులు ఎలా తెలుసు అనే అనుమానం రావచ్చు. సోహైల్ రీసెంట్ గా బూట్ కట్ బాలరాజు చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో సోహైల్ బిజీగా ఉన్నాడు.
ఓ ఇంటర్వ్యూలో సోహైల్ రాంచరణ్, బుచ్చిబాబు సినిమా విశేషాల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సోహైల్ మాట్లాడుతూ బుచ్చిబాబు అన్న నాకు బాగా క్లోజ్. నేను రెగ్యులర్ గా బుచ్చిబాబు అన్నతో మాట్లాడుతుంటాను. నా సమస్యలు కూడా అన్నకి చెప్పుకుంటాను. బుచ్చిబాబు అన్న నాకు అంత మంచి ఫ్రెండ్.
రీసెంట్ గా బుచ్చిబాబు అన్నని కలిశాను. రాంచరణ్ గారితో పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు.. బిగ్ అఛీవ్మెంట్ మీకు ఇది అని చెప్పను. వెంటనే బుచ్చిబాబు అన్న మాట్లాడుతూ పాన్ ఇండియా కాదు అది పాన్ వరల్డ్ మూవీ అని చెప్పారు. సోహైల్ చేసిన ఈ వ్యాఖ్యలు రాంచరణ్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాయి.
బుచ్చిబాబు ప్లానింగ్ మాములుగా లేదే అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం గురించి రాంచరణ్ గతంలోనే కామెంట్స్ చేశారు. ఈ చిత్ర కథ ఇండియన్ నేటివిటీలో డీప్ గా ఉంటూ ప్రపంచ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుందని చరణ్ నేషనల్ మీడియాకి తెలిపారు. ఇదంతా చూస్తుంటే చరణ్, బుచ్చిబాబు నుంచి కనీవినీ ఎరుగని చిత్రం రాబోతున్నట్లు అర్థం అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ ఓ కొలిక్కి రాగానే బుచ్చిబాబు చిత్రం షురూ కానుంది.