జబర్దస్త్ కామెడీ షోతో పాప్యులర్ అయ్యింది ప్రియాంక సింగ్. ఈమె ట్రాన్స్ జెండర్. ప్రియాంక అసలు పేరు సాయి తేజ. ఈ పేరుతోనే జబర్దస్త్ లో స్కిట్స్ చేసింది. ఈమె లేడీ గెటప్స్ కి పెట్టింది పేరు.
చాలా కాలం ఆమె జబర్దస్త్ లో కొనసాగారు. సడన్ గా జబర్దస్త్ కామెడీ షోకి దూరమైంది. హఠాత్తుగా బిగ్ బాస్ షోలో ప్రత్యక్షమైంది. బిగ్ బాస్ సీజన్ 5లో ప్రియాంక సింగ్ పార్టిసిపేట్ చేసింది.
హౌస్లో అమ్మడు సత్తా చాటింది. అసలు అమ్మాయిలు కూడా కుళ్ళుకునేలా ప్రియాంక సింగ్ గ్లామర్ ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా అదే స్థాయిలో చేసేది. ప్రియాంక డ్రెస్సింగ్, మేకప్ కి జనాలు ఫిదా అయిపోయారు. ప్రియాంక సింగ్ హౌస్లో లవ్ స్టోరీ నడపడం విశేషం.
నటుడు మానస్ ని ప్రియాంక చాలా ఇష్టపడింది. ఎప్పుడూ అతని చుట్టే తిరిగేది. ఒక్క మానస్ తప్ప హౌస్లో ఉన్న అందరు అబ్బాయిలు అన్నయ్యలే అని ప్రియాంక సింగ్ చెప్పింది.
స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ప్రియాంక సింగ్ 13 వారాలు హౌస్లో ఉంది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే తాను జెండర్ మార్చుకున్న విషయం చెప్పింది. ఈ విషయం వాళ్ళ నాన్నకు కూడా తెలియదని చెప్పి ఎమోషనల్ అయ్యింది.
Priyanka Singh
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ప్రియాంక సింగ్ పెద్దగా కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. తాజాగా ఆమె బోల్డ్ వీడియో షేర్ చేసింది. బాత్ టబ్ లో స్నానం చేస్తున్న వీడియో షేర్ చేసి షాక్ ఇచ్చింది.
ప్రియాంక సింగ్ హాట్ వీడియో వైరల్ అవుతుంది. ప్రియాంక సింగ్ బుల్లితెర షోలు కూడా చేయడం లేదు. ఇంస్టాగ్రామ్ లో వరుస ఫోటో షూట్స్ , వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది.