రాజమౌళి లేకపోతే ప్రభాస్ పరిస్థితి ఏంటి.. వేణు స్వామిపై శివాజీ కామెంట్స్

First Published | Jan 6, 2024, 11:06 AM IST

వేణు స్వామి అంటే తనకి నిజంగా గౌరవం ఉంది అని శివాజీ అన్నారు. కొన్ని విషయాలని ఆయన చాలా నిజాయతీగా చెబుతారు.

Sivaji

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 7 ఎంతటి వినోదాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీజన్ 7 అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఫినాలే ముగిసిన తర్వాత కూడా ఆడియన్స్ బిగ్ బాస్ ని మరచిపోవడం లేదు. పల్లవి ప్రశాంత్ విషయంలో జరిగిన వివాదాలే అందుకు కారణం. మరో వైపు శివాజీ కెరీర్ లో కూడా మునుపటి జోష్ వచ్చేసింది. 

శివాజీ హౌస్ నుంచి బయటకి వచ్చాక ఆయన నటించిన 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఈటివి విన్ ఓటిటిలో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. ఈ నేపథ్యంలో శివాజీ వరుసగా యూట్యూబ్ ఛానల్స్ లో, టివి ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అయితే బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి ముందు శివాజీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలు వైరల్ గా మారింది. 


ఆ ఇంటర్వ్యూలో శివాజీ ప్రభాస్, వేణు స్వామి గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చివరగా తాను ప్రభాస్ ఆదిపురుష్ చిత్రాన్ని చూశానని శివాజీ అన్నారు. రామాయణాన్ని విభిన్నంగా చూపించాలనే దర్శకుడి ఆలోచనని అభినందించాల్సిందే అని శివాజీ అన్నారు. అయితే కొన్ని అంశాల్లో దర్శకుడు తప్పు చేయడం వల్ల సినిమా కాస్త దెబ్బ తినింది అని అన్నారు. 

రావణాసురుడి పాత్ర సైఫ్ అలీ ఖాన్ సెట్ కాలేదని శివాజీ విమర్శించారు. ఏది ఏమైనా ఆదిపురుష్ చిత్రం ఒక మంచి ప్రయత్నం అని అన్నారు. రాజమౌళి లేకపోతే ప్రభాస్ కి అంత క్రేజ్ లేదు అని విమర్శలు ఎదురవుతున్నట్లు యాంకర్ శివాజీని ప్రశ్నించగా.. ఆ విధంగా మనం మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే ప్రభాస్ అంటే ప్రభాసే. అతడికి తిరుగులేదు అని శివాజీ అన్నారు. 

ప్రభాస్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అలాంటి ప్రశ్నలు నన్ను అడగొద్దు. వాటికి సమాధానం కావాలంటే మీరు వేణు స్వామి దగ్గరకి వెళ్ళండి అని శివాజీ సరదాగా అన్నారు. వేణు స్వామి తరచుగా ప్రభాస్ జాతకంపై సంచలన వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. 

వేణు స్వామి అంటే తనకి నిజంగా గౌరవం ఉంది అని శివాజీ అన్నారు. కొన్ని విషయాలని ఆయన చాలా నిజాయతీగా చెబుతారు. ఆస్ట్రాలజర్ గా వేణు స్వామిని తానూ అభిమానిస్తానని శివాజీ తెలిపారు. 

Latest Videos

click me!