బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది. కానీ ఆ హీట్ ఇంకా తగ్గలేదు. బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే తర్వాత బయట జరిగిన అల్లర్లు, వాహనాలపై దాడులతో సరికొత్త వివాదం రాజుకుంది. తన అభిమానులని పల్లవి ప్రశాంత్ రెచ్చగొట్టేలా వ్యవహరించాడని, పోలీసులకు సహకరించలేదని అతడిని అరెస్ట్ చేశారు. అయితే పల్లవి ప్రశాంత్ బెయిల్ పై బయటకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ క్రమంలో బిగ్ బాస్ షోలో హైలైట్ అయిన మరో కంటెస్టెంట్ నటుడు శివాజీ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. శివాజీ వరుసగా టివి ఛానల్స్ కి, యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ బిగ్ బాస్ హౌస్ లో జరిగిన సంగతులపై తన అభిప్రాయం చెబుతున్నారు. ఈ క్రమంలో శివాజీ చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
ముఖ్యంగా శోభా శెట్టి గొడవతో తనని నెగిటివ్ గా చూపించే ప్రయత్నం చేశారని శివాజీ ఆరోపించారు. శోభా శెట్టి పరాకాష్టకు వెళ్ళింది. అందుకే మా ఇంట్లో ఆడపిల్లలు అయితే.. అంటూ కోపంగా ప్రవర్తించానని శివాజీ అన్నారు. గేమ్ ఒక దశకు వచ్చాక విన్నర్ ఎవరో.. ఎవరెవరికి ఏ స్థానాలు దక్కుతాయో కూడా నేను అంచనా వేసా.
ఒక సమయంలో ప్రశాంత్ చేతిలో నేను రాసా.. 1, 2, 3 స్థానాల్లో మనం ముగ్గురమే ఉండబోతున్నాం అని శివాజీ అన్నారు. అయితే ఊహించని విధంగా ఒక వ్యక్తిని హైలైట్ చేస్తూ వచ్చారు. బిగ్ బాస్ కూడా అతడిని పొగడడం మమ్మల్ని పక్కన పెట్టడంతో నాకు కాలింది. అతడి పేరు నేను చెప్పను కానీ ఊహించని విధంగా అతడిని కావాలనే హైలైట్ చేశారు.
Bigg Boss Telugu 7
పలుసార్లు పౌల్ గేమ్ ఆడిన వ్యక్తిని రన్నరప్ చేశారు అంటూ శివాజీ పరోక్షంగా అమర్ దీప్ పై ఫైర్ అయ్యారు. ఇలాంటి తప్పిదాల వల్ల నాగార్జున గారికి బ్యాడ్ నేఁ రాకూడదు. అందుకే నేను శోభా శెట్టి విషయంలో నాగార్జునతో గట్టిగా మాట్లాడినట్లు శివాజీ పేర్కొన్నారు. గేమ్ న్యాయంగా జరిగి ఉంటే టాప్ 3లో ప్రశాంత్, నేను, యావర్ ఉండేవాళ్ళం అని శివాజీ అన్నారు.
ఏది ఏమైనా రిజల్ట్ వచ్చేసింది కాబట్టి దానిని మనం గౌరవించాలి. నేను కామన్ మ్యాన్ కి సపోర్ట్ ఇవ్వాలని అనుకున్నా అది చేశా. అలాగని ప్రశాంత్ కి పూర్తిగా నేను సపోర్ట్ చేయలేదు. వాడి గేమ్ వాడు ఆడాడు గెలిచాడు అని శివాజీ అన్నారు.