లగ్జరీ బడ్జెట్ టాస్క్ ని ఎంజాయ్ చేసిన కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ నెక్స్ట్ టాస్క్ లో పరీక్ష పెట్టాడు. ఈవారానికి గాను ప్రతి కంటెస్టెంట్ బెస్ట్, వరస్ట్ పర్ఫామర్‌లను ఎన్నుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఎంటర్‌టైన్ చేస్తున్న లోబో బెస్ట్ పర్ఫామర్ అని, కంటెస్టెంట్లతో గొడవలు పెట్టుకున్న జెస్సీ వరస్ట్ పర్ఫామర్ అని రవి తన అభిప్రాయం తెలియజేశారు. అనంతరం లోబో.. కిచెన్‌లో ఎలాంటి సమస్యలు తేనందుకు యానీ మాస్టర్ బెస్ట్ అని.. తెలిసో, తెలియకో తప్పులు చేస్తూ, నోరు జారుతున్న జెస్సీ వరస్ట్ పర్ఫామర్ అని తెలిపాడు. అనంతరం జెస్సీ వంతురాగా.. సిరిని బెస్ట్, టాస్క్‌ను జోక్‌గా తీసుకున్నాడంటూ రవిని వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపిక చేశాడు. శ్వేత వర్మ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ విశ్వ బెస్ట్, పెద్ద నోరేసుకుని మాట్లాడుతున్న ఉమాదేవి వరస్ట్ పర్ఫామర్ అని చెప్పింది.