సోహెల్, అఖిల్ రెమ్యూనరేషన్స్ లీక్... ఎవరెవరికి ఎంత దక్కిందంటే!

First Published | Dec 29, 2020, 2:23 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ కోసం పోటీపడ్డారు అభిజిత్, అఖిల్ మరియు సోహెల్. మొదటి నుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్న ఈ ముగ్గురు ఊహించిన విధంగానే ఫైనల్ కి చేరుకున్నారు. నాగార్జున ఆఫర్ చేసిన రూ. 25 లక్షలు తీసుకొని సోహెల్ మూడవ స్థానంతో సరిపెట్టుకొని రేసు నుండి తప్పుకున్నారు. ఇక టైటిల్ విన్నర్ గా అభిజీత్ నిలువగా, అఖిల్ రన్నర్ అయ్యాడు.

కాగా బిగ్ బాస్ లో పాల్గొన్నఏ ఏ కంటెస్టెంట్ ఎంత తీసుకున్నారు... వారి పారితోషికం ఎంత అనే విషయంలో ప్రేక్షకులు ఆసక్తితో ఉన్నారు. షో తరువాత బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. దీనితో వీరి రెమ్యూనరేషన్స్ పై క్లారిటీ వస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ గా నిలిచిన అఖిల్ రెమ్యూనరేషన్ పై ఓ న్యూస్ బయట చక్కర్లు కొడుతుంది. ఆ వార్త ప్రకారం... సోహెల్, అభిజీత్ లకంటే చాలా తక్కువ అఖిల్ కి దక్కినట్లు తెలుస్తుంది.

బిగ్ బాస్ నిర్వాహకులు రోజుకు రూ. 25వేల ఒప్పందంతో ఆయనను హౌస్లోకి పంపించారట. ఆ లెక్కన 105 రోజులు ఉన్న అఖిల్ కి రూ. 26లక్షలు పారితోషికంగా అందాయట. అంటే సోహెల్ టైటిల్ రేసు నుండి తప్పుకోవడం వలన ఎంత దక్కిందో కొంచెం అటూ ఇటుగా అఖిల్ పొందారు.
నాగార్జున ఆఫర్ చేసిన రూ. 25 లక్షలతో పాటు మరో పదిలక్షలు రూపాయలు సోహెల్ కి దక్కాయి. ఆ పది లక్షలు డొనేషన్స్ కి పోయినా కూడా, ఆయనకు రూ. 25 లక్షలు మిగిలాయి. ఇక హౌస్ లో 105 రోజులు ఉన్న సోహెల్ రెమ్యూనరేషన్ క్రింద మరో రూ. 26 లక్షలు దక్కించుకున్నాడట. అలా మొత్తంగా రూ. 51 లక్షలు సోహెల్ కి దక్కినట్లు సమాచారం.
ఆ లెక్కనబిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ గా అఖిల్ కి కేవలం 26 లక్షల రూపాయలు అందితే.. మూడవ స్థానం పొందిన సోహెల్ మాత్రం రెట్టింపు మనీ దక్కించుకొని షాక్ ఇచ్చాడు.
ఇక టైటిల్ విన్నర్ అభిజిత్ప్రైజ్ మనీరూ. 25 లక్షలు గెలుచుకోవడం జరిగింది. దానితో పాటు 105 రోజులకు కనీసం 30 నుండి 40 లక్షలు పొంది ఉంటాడని సమాచారం. అలా అభిజీత్ 55 నుండి 65 లక్షలు బిగ్ బాస్ షో ద్వారా ఆర్జించారు.
టాప్ 3 కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్, ప్రైజ్ మనీతో పోల్చుకుంటే... అఖిల్అతి తక్కువ పొందారు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది.

Latest Videos

click me!