బిగ్ బాస్ సీజన్ 7లో హైలైట్ అయిన కంటెస్టెంట్స్ లో ప్రియాంక జైన్ ఒకరు. ఫైనలిస్ట్ గా నిలిచిన ప్రియాంక జైన్ సీజన్ 7 లో ప్రతి స్టేజిలో బలమైన ప్రదర్శన ఇస్తూ అందరికి పోటీగా నిలిచింది. తన స్నేహితురాలి శోభా శెట్టి ఎక్కువగా గ్లామర్ పై ఫోకస్ పెడుతుంటే ప్రియాంక మాత్రం గేమ్ అందుతూ దూసుకుపోయింది.
అయితే ప్రియాంక జైన్ ఇప్పుడు తాను బిగ్ బాస్ కి వెళ్లకుండా ఉండాల్సింది అంటూ బోరున ఏడ్చేస్తోంది. దీనితో అసలేమైంది అంటూ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. తాను ఎందుకు భాదపడుతున్నానో కూడా ప్రియాంక వివరించింది.
బిగ్ బాస్ తర్వాత తన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని ప్రియాంక భావించింది. కానీ అందుకు భిన్నంగా జరిగిందట. తాజాగా తన తల్లికి సర్జరీ జరిగినట్లు ప్రియాంక పేర్కొంది. ఆమెకి గత కొంతకాలంగా నెలసరి ఎక్కువ అవుతోందట. బ్లీడింగ్ ఎక్కువ అవుతుండటంతో వయసు పెరుగుతుండడం వల్ల జరిగే మార్పులు అని అనుకున్నారట. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తే క్యాన్సర్ మొదటి దశలో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రియాంక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన తల్లికి ఈ సమస్య మొదలయింది. కానీ ప్రియాంకని బిగ్ బాస్ షోలో చూడాలని ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ కాలేదు. దీనితో తాను బిగ్ బాస్ హౌస్ కి వెళ్లకుండా ఉండి ఉంటే బావుండేదని ప్రియాంక బోరున ఏడ్చేసింది. కన్నీరు మున్నీరుగా విలపించింది. అయితే గర్భాశయం తొలగిస్తే క్యాన్సర్ తగ్గే అవకాశం ఉందని వైద్యులు సూచించారట.
దీనితో తన తల్లికి ఆపరేషన్ చేసేందుకు ప్రియాంక అంగీకరించింది. తన తల్లిని ఆపరేషన్ థియేటర్ కి తీసుకువెళ్లే సమయంలో ప్రియాంక మరింత ఎక్కువగా ఏడ్చేసింది. అయితే సర్జరీ విజయవంతంగా పూర్తి కావడంతో ప్రియాంక ఊపిరి పీల్చుకుంది.తానూ బిగ్ బాస్ లోకి వెళ్లకుండా తన తల్లి ఆరోగ్యం పై కేర్ తీసుకుని ఉంటే ఇంత వరకు వచ్చేది కాదని ప్రియాంక బాధపడుతోంది.
డిశ్చార్జ్ అయినా తర్వాత తన తల్లిని ఇంటికి తీసుకువెళ్ళింది. ప్రియాంక తరచుగా తన ఫ్యామిలీ విశేషాలని, సంగతులని యూట్యూబ్ ఛానల్ లో పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. తన తల్లి గురించి ప్రియాంక ఎమోషనల్ కావడంతో ఫ్యాన్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు. ప్రియాంక తల్లి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుతున్నారు.