బిగ్ బాస్ రద్దు: కంటెస్టెంట్స్ కూడా ఎంపిక అయ్యాక అనూహ్య పరిణామం... అసలు ఏమైంది?

First Published | Jan 30, 2024, 5:35 PM IST

బిగ్ బాస్ షోకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. అయితే బిగ్ బాస్ లవర్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ అందుతుంది. 
 

Bigg boss telugu ott season 2

బిగ్ బాస్ తెలుగులో సక్సెస్ఫుల్ గా 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఒక్క సీజన్ 6 మినహాయిస్తే... ప్రతి సీజన్ సూపర్ హిట్. లేటెస్ట్ బిగ్ బాస్ 7 అయితే బ్లాక్ బస్టర్. విపరీతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో బిగ్ బాస్ ఓటీటీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలువచ్చాయి. 
 

Bigg boss Nonstop

బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ప్రసారమైన ఓటీటీ సీజన్ 1 హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయ్యింది. ఓ మోస్తరు ఆదరణ పొందింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తో పాటు మరికొందరు కొత్తోళ్ళు పాల్గొన్నారు. హీరోయిన్ బిందు మాధవి టైటిల్ విన్నర్ అయ్యింది. 


Bigg Boss Nonstop

ఇక త్వరలో ఓటీటీ సీజన్ 2 అంటూ ఇటీవల వరుస కథనాలు వెలువడ్డాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనే మొదలు కానుందన్న ప్రచారం జరిగింది. సీజన్ 7లో పాల్గొన్న భోలే షావలి, నయని పావని ఎంపికయ్యారని  కథనాలు వెలువడ్డాయి. 

Bigg Boss Nonstop

అలాగే నటుడు భద్రం, హీరోయిన్ రిచా పనయ్, సింగర్ పార్వతి, సోషల్ మీడియా సెలబ్ బర్రెలక్క, యష్ మాస్టర్ కంటెస్టెంట్స్ గా తెరపైకి వచ్చారు. తీరా చూస్తే షో రద్దయినట్లు గట్టి సమాచారం అందుతుంది. దీనికి ప్రధాన కారణం... టాప్ సెలెబ్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఓటీటీ వెర్షన్ వలన రెగ్యులర్ షో మాదిరి పాపులారిటీ దక్కదని భావిస్తున్నారట. 

Bigg Boss Nonstop

అలాగే నాగార్జున హోస్టింగ్ చేసేందుకు నిరాకరించారట. అదే సమయంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ వన్ కూడా అంతంత మాత్రమే ఆదరణ పొందింది. ఈ కారణాలతో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ రద్దు చేశారట. అయితే వీలైనంత త్వరగా బిగ్ బాస్ సీజన్ 8 ప్రసారం అవుతుందనే ప్రచారం జరుగుతుంది. 

Latest Videos

click me!