పొట్టి డ్రెస్ లో బిగ్ బాస్ బ్యూటీ మెరుపులు.. బాల్కనీలో కొంటె పోజులతో హారిక రచ్చ..

First Published | Jun 16, 2023, 2:18 PM IST

బిగ్ బాస్ తెలుగు ఫేమ్ అలేఖ్య హారిక గ్లామర్ మెరుపులతో నెట్టింట సందడి చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ గా మినీ డ్రెస్ లో దర్శనమిచ్చింది. 
 

యూట్యూబ్ లో దేత్తడి హారికగా సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ యాస, భాష అనర్గళంగా మాట్లాడగల ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 
 

ఆ క్రేజ్ తోనే అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షో ద్వారా బుల్లితెర ఆడియెన్స్ కు కూడా హారిక రీచ్ కాగలిగింది. Bigg Boss  తెలుగు సీజన్ 4లో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆడియెన్స్ ను అలరించింది. 
 


అయితే, బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చాక హారికకు మరింత క్రేజ్ దక్కింది. కానీ ఆ క్రేజ్ ను హారిక వినియోగించుకోవడంతో కాస్తా వెనకబడిందనే చెప్పాలి. అషురెడ్డి, శ్రీహాన్, సోహెల్ వంటి వారు సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. 
 

హారిక మాత్రం ఇంక అక్కడే ఉండిపోయింది. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. క్రేజీ పోస్టులు పెడుతూ సందడి చేస్తోంది.  స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తోందీ ముద్దుగుమ్మ. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.
 

లేటెస్ట్ గా హారిక పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. ఎల్లో కలర్ మినీ టైట్ గౌన్ లో హారిక అందాలను ఆరబోసింది. బాడీ కొలతలు చూపిస్తూ మైమరిపించింది. మరోవైపు బ్యాక్ అందాలతో మతులు పోగొట్టింది. బాల్కానీలో నిల్చుని కొంటెగా ఫోజులిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. 
 

ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్, నెటిజన్లు లైక్స్, కామెంట్లు పెడుతున్నారు. ఇక రీసెంట్ గా హారిక ‘వెళ్లకే’ అనే మ్యూజిక్ వీడియోలోనూ నటించింది. ప్రస్తుతం మరిన్ని అవకాశాల కోసం ఎదుచూస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో వచ్చిన చిన్న చిన్న ఆఫర్లను కూడా వినియోగించుకుంటోంది. 
 

Latest Videos

click me!