పడుకుంటే 2 లక్షలు ఇస్తానన్నాడు.. డైరెక్టర్ బండారం బయటపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ శ్వేత వర్మ ...?

First Published | Oct 20, 2022, 1:34 PM IST

కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది బిగ్ బాస్ ఫేస్ స్వేత వర్మ. ఇండస్ట్రీలో జరిగిన తనఅనుభవాన్ని రీసెంట్ గా పంచుకుంది. అవకాశాల కోసం తనను ఏం అడిగారో వివరంగా చెపుతూ.. ఓ డైరెక్టర్ బండారం బయట పెట్టింది బ్యూటీ. 
 

ఫిల్మ్  ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ భూతం కామన్ అయిపోయింది.  మీటు ఉద్యమం వల్లు అది బయటకు వచ్చి.. రచ్చ రచ్చ అయ్యింది. అయితే ఇప్పుడు  కాస్టింగ్ కౌచ్ ఉందో లేదో తెలియదు కాని..  ఇప్పటికే చాలా మంది తారలు  తాము కాస్టింగ్ కౌచ్ భారిన పడ్డట్టు ముందుకు వస్తున్నారు. ఇక ఈ విషయంలో తన అనుభవాలు పంచుకుంది బిగ్ బాస్ బ్యూటీ  శ్వేత వర్మ

రీసెంట్ గా జరిగిన  ఓ ఇంటర్వ్యూలో శ్వేత వర్మ  కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. తను కూడా దీని  వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిపింది. గతంలో తనకు జరిగిన అవమానాలు గురించి వివరిస్తూ.. షాకింగ్ విషయాలు బయట పెట్టింది. ఓ డైరెక్టర్  బండారం బయటపెట్టేసింది. 


సినిమాల్లోకి రాకముందు తాను  షార్ట్ ఫిలిమ్స్ చేసేదానని చెప్పుకొచ్చింది శ్వేత.  2013లో తాను షార్ట్ ఫిల్మ్స్ చేసేటైమ్ లో ఒక డైరెక్టర్ తో తనకు పరిచయం అయ్యిందని... అయితే తనకు అవకాశం ఇస్తాడు అనుకుని ఆ దర్శకుడిని తాను నమ్మానని చెప్పింది. కాని  అప్పుడు ఆ డైరెక్టర్ తనను కమిట్మెంట్ అడిగాడని చెప్పింది.  ఆ టైమ్ లో అసలు  కమిట్మెంట్ అంటే తెలియదని  అంటోంద శ్వేత వర్మ. 

అంతే కాదు తను ఈ విషయం అర్దం చేసుకోలేదని గ్రహించిన అతను.. ఆతరువాత మరీ బరితెగించి... ఓ  రెండు లక్షలు ఇస్తా వస్తావా అని డైరెక్ట్ గా అడిగేశాడని  శ్వేత వర్మ సంచలన నిజాలు బయటపెట్టింది.ఇక అప్పుడు కోపం, బాధ తట్టుకోలేక పోయానని శ్వేత ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తాను బాగా ధైర్యంగా ఉండే అమ్మాయిననలో దాంతో.. ఆ సమయంలో తను  కోపం ఆపుకోలేక ఆ దర్శకుడిని  బిల్డింగ్ పైనుంచి దూకండి పీడా పోతుంది అంటూ వార్నింగ్ ఇచ్చానంటోంది శ్వేత. 

శ్వేత వర్మ బిగ్ బాస్ సీజన్ -5 లో సందడి చేసింది. అంతకు ముందు ది రోజ్ విల్లా,  ముగ్గురు మొనగాళ్లు, మిఠాయి లాంటి సినిమాల్లో నటించింది. కాని ఆమెకు అక్కడ అంతగా క్రేజ్ రాలేదు. దాంతో బిగ్ బాస్ అవకాశం వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో ఆమె ఫైర్ బ్రాండ్. ఓక రకంగా లేడీ అర్జున్ రెడ్డి అనే బిరుదు కూడా సాధించింది. కాని టైటిల్ గెలవలేకపోయింది. 

కానీ శ్వేతా వర్మ ఎక్కువ కాలం హౌస్‌లో ఉండలేకపోయింది. అంతేకాకుండా శ్వేత వర్మ కెరిర్ బిగ్ బాస్ కు ముందు ఆ తరవాత అని చెప్పాలి. బిగ్ బాస్ తరువాత కూడా శ్వేత వర్మ కొన్ని సినిమాల్లో నటించినా ఆశించిన విజయం అందుకోలేదు. 
 

 శ్వేతావర్మ నటించినవి చిన్న సినిమాలు కావడం … హిట్ అవ్వకపోవడంతో ఆశించినమేర విజయాలు అందుకోకపోవడంతో పెద్దగా ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. బిగ్ బాస్ ఎంట్రీ కూడా ఆమెకు ఏమాత్రం ఉపయోగపడలేదు. బిగ్ బాస్ తరువాత కోన్ని ప్రాజెక్ట్ లు చేసినా..? లైఫ్ సెట్ అయ్యేలా బ్రేక్ మాత్రం రాలేదు శ్వేతాకు. 
 

Latest Videos

click me!