నటుడు శివాజీ బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న విషయం తెలిసిందే. టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం పొందింన శివాజీ మూడో స్థానంలో నిలిచాడు. చివరి వారాల్లో శివాజీ ప్రవర్తన విమర్శల పాలైంది. దాంతో టైటిల్ రేసులో వెనుకబడ్డాడు.
25
ఇక పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ హౌస్లో శివాజీ శిష్యుడిగా మెలిగాడు. రైతుబిడ్డ టైటిల్ గెలవడం సంతోషం కలిగించిందని శివాజీ కామెంట్ చేశాడు. ఇక వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న శివాజీ ప్రభాస్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
35
ఆదిపురుష్ మూవీ విషయంలో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని అన్నాడు. దర్శకుడు ఓం రౌత్ భిన్నంగా రామాయణాన్ని తెరకెక్కించాలి అనుకున్నాడు. కొన్ని విషయాల్లో దర్శకుడు చేసిన తప్పులు చిత్ర ఫలితాన్ని దెబ్బ తీసిందని అన్నాడు.
45
Sivaji
ఇక రావణుడు పాత్ర చేసిన సైఫ్ అలీ ఖాన్ మెప్పించలేదని అన్నాడు. ప్రభాస్ కి మాత్రం ఫుల్ మార్క్స్ వేశాడు. ఇక ప్రభాస్ అంటే ప్రభాసే. ఆయనకు తిరుగులేదని శివాజీ అన్నాడు. శివాజీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
55
మరోవైపు శివాజీ నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఆయన నటించిన నైంటీస్ ఇటీవల విడుదలైంది. ఈటీవీ విన్ లో నైంటీస్ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. శివాజీ మిడిల్ క్లాస్ తండ్రి పాత్ర చేశాడు.