Salaar Celebration: `సలార్‌` బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్‌లో ప్రభాస్‌ హంగామా.. ఇంత లేట్‌కి కారణం ఏంటంటే?

Published : Jan 08, 2024, 03:39 PM IST

ప్రభాస్‌ నటించిన `సలార్` మూవీ బాక్సాఫీసు వద్ద మోత మోగించింది. ప్రశాంత్‌ నీల్‌ మ్యాజిక్‌కి, డార్లింగ్‌ కటౌట్‌కి థియేటర్ల ఊగిపోయాయి. దీంతో సక్సెస్‌ సెలబ్రేషన్‌ నిర్వహించారు.   

PREV
16
Salaar Celebration: `సలార్‌` బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్‌లో ప్రభాస్‌ హంగామా.. ఇంత లేట్‌కి కారణం ఏంటంటే?

`కేజీఎఫ్‌2` తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన `సలార్‌` గత నెలలో విడుదలైంది. ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నార్త్ లో షారూఖ్‌ ఖాన్‌ `డంకీ` దెబ్బ గట్టిగా ఉన్నప్పటికీ తిరుగులేని కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికీ ఈ చిత్రం 680కోట్లు దాటింది. 700 లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఈ వీకెండ్‌ వరకు ఆ మార్క్ కి చేరువ కానుందని తెలుస్తుంది. 
 

26

తాజాగా ఈ మూవీయూనిట్‌ సక్సెస్‌ సెలబ్రేషన్‌ నిర్వహించారు. మెయిన్‌ కాస్టింగ్‌ అయిన ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇందులో పాల్గొన్నారు. వీరితోపాటు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, నిర్మాత విజయ్‌ కిరగందూర్‌, నైజాం రైట్స్ తీసుకుని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు పాల్గొన్నారు. ఇతర టీమ్‌ మెయిన్‌ కాస్టింగ్‌, అండూ క్రూ పాల్గొన్నారు. 

36

`సలార్‌` బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్‌ని గ్రాంగ్‌గా చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిత్ర బృందం విడుదల చేసింది.సినిమా మొత్తం బ్లాక్‌ టోన్‌లో సాగుతుంది. సక్సెస్‌ సెలబ్రేషన్‌ లో కూడా అంతా బ్లాక్‌ డ్రెస్‌ కోడ్‌లో రావడం విశేషం. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

46

ఇందులో ప్రభాస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆయన బ్లాక్ టీషర్ట్ ధరించి కనిపించారు. తలకు క్యాప్‌ పెట్టుకున్నారు. పృథ్వీరాజ్‌తో కలిసి ప్రభాస్‌ `సలార్‌` బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్‌ నిర్వహించారు. వారిలో బ్లాక్‌ బస్టర్‌ హ్యాపీనెస్‌ కనిపిస్తుంది. 

56

ఇదిలా ఉంటే సినిమా విడుదలై 18 రోజుల తర్వాత సక్సెస్‌ పార్టీ చేసుకోవడానికి కారణం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. `సలార్‌` సినిమాకి ప్రారంభం నుంచే బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ వచ్చింది. అదే ఊపు కనిపించింది. `డంకీ` వంటి సినిమా ప్రభావం ఉన్నా, కలెక్షన్ల పరంగా ఎక్కడా తగ్గలేదు. కర్నాటక, తమిళనాడులో ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కానీ తెలుగు స్టేట్స్ లో, నార్త్ లో, అలాగే ఓవర్సీస్‌లో ఈ మూవీ భారీగానే వసూలు చేసింది. 

66

అయితే లేటెస్ట్ గా ఈ మూవీ సేఫ్‌ జోన్‌లోకి వెళ్లిందని తెలుస్తుంది. ఈ మూవీ 345కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ చేసింది. ఇప్పుడు ఆ మార్క్ ని దాటింది `సలార్‌`. దీంతో చాలా వరకు బయ్యర్లు సేఫ్‌. కొన్ని ఏరియాల్లో నష్టాలు ఉన్నా, మేజర్‌గా ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌కి చేరుకుంది. దీంతో ఇప్పుడు అసలైన సక్సెస్‌గా టీమ్‌ భావించి తాజాగా బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్‌ చేసుకున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories