మీరు అనుకున్నంత ఈజీగా మా జీవితాలు... బిగ్ బాస్ శివ జ్యోతి సంచల కామెంట్స్!

First Published Mar 5, 2021, 9:17 AM IST

బిగ్ బాస్ ఫేమ్  శివ జ్యోతి భర్త మరియు జీవితం గురించి చేసిన కొన్ని వాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఉమెన్స్ డే కానుకగా ప్రసారం కానున్న ఓ ప్రోగ్రాంలో శివ జ్యోతి ఈ వ్యాఖ్యలు చేశారు. 

వివిధ రంగాలలో  రాణిస్తూ, మిగతా వారికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలను  గౌరవిస్తూ ‘మగువా లోకానికి తెలుసా నీ విలువా’ అనే వినోద కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు
undefined
యాంకర్ శివజ్యోతిని కూడా ఈ ఈవెంట్ లో సత్కరించారు. ఈ సందర్భంగా శివ జ్యోతి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.  ఇక భర్త గంగులుతో ప్రేమ, పెళ్లి.. ఇంట్లో నుంచి బయటకు వచ్చేయడం.. అనేక కష్టాలు అనుభవించడం ఇవన్నీ ఆమె లైఫ్‌లో ఎదుర్కొన్న స్ట్రగుల్స్.
undefined
శివజ్యోతి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఇప్పుడు లగ్జరీ లైఫ్‌ని అనుభవిస్తూ సెలబ్రిటీ హోదా అనుభవిస్తుంది అంటే.. తన భర్త గంగులు ఆమెకు తోడుగా నీడగా అండగా ఉండటమే అని పలు సందర్భాల్లో చెప్పింది శివజ్యోతి.
undefined
అయితే తాజా ప్రోమోలో.. శివంగివే అనే సాంగ్‌కి రవిక్రిష్ణతో కలసి పెర్ఫామ్ చేసింది. తన భర్త గంగులు చేతుల మీదుగా ఉమెన్స్ డే షీల్డ్ తీసుకున్న తరువాత ఎమోషనల్ అయ్యింది శివజ్యోతి.
undefined
నా తరఫున ఒక రిక్వెస్ట్ ఏంటంటే.. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఉందనుకోండి.. ఎక్కువ సంపాదిస్తుంది అనుకోండి.. ఏయ్ దానికేందిరా.. అది సంపాదిస్తుంది.. దాని మొగుడు కూర్చుని తింటుండు అని అందరూ అనుకుంటారు. కానీ మీరు అనుకున్నంత ఈజీ కాదు మా లైఫ్‌లు. సపోర్ట్ చేసేవాళ్లని మీకు తెలియకుండానే కిందపడేస్తారనిపిస్తుంది అంటూ తన భర్త గంగులు పక్కన ఉండగా కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయ్యింది శివజ్యోతి.
undefined
శివ జ్యోతి అలా మాట్లాడం వెనుక బలమైన కారణం ఉండి ఉంటుందని కొందరు అనుకుంటున్నారు. నిజ జీవితంలో ఎవరో తనని అలాంటి మాటలు అని ఉంటారని అర్థం అవుతుంది.
undefined
ఇక ఈ కార్యక్రమంలో ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయ భానుతో పాటు మరికొందరు బుల్లితెర సెలెబ్రిటీలు పాల్గొన్నారు. మగువా లోకానికి తెలుసా నీ విలువా ప్రోగ్రాం... ప్రోమో విశేషంగా ఆకట్టుకుంది.  శివ జ్యోతి,
undefined
click me!