పెళ్ళికి ముందే అతడికి అన్నీ ఇచ్చేశా, నేను వర్జిన్ కాదు, ఆ కారణంగా పెళ్లి క్యాన్సిల్, బిగ్ బాస్ సరయు సంచలనం

First Published | Sep 28, 2021, 8:56 AM IST

యూట్యూబ్ స్టార్స్ లో సరయు ఒకరు. రెగ్యులర్ గా యూట్యూబ్ కంటెంట్ ఫాలో అయ్యేవాళ్ళకు ఈమె పరిచయం అక్కర్లేని పేరు. బూతు కంటెంట్ తో ఫేమస్ అయిన 7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె వెలుగులోకి వచ్చారు. 
 

బూతులతో కూడిన సినిమా రివ్యూలు, అడల్ట్ కామెడీ స్కిట్స్ తో సరయు యూట్యూబ్ స్టార్ గా ఎదిగారు. ఒక అమ్మాయి నోటి నుండి బూతులు వినడం ఎంజాయ్ చేసే జనాలకు సరయు యాటిట్యూడ్ భలే నచ్చేస్తుంది. 

ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ సీజన్ 5కి ఎంపికై హౌస్ లోకి అడుగుపెట్టారు. బయటే ధూమ్ ధామ్ చేసే సరయు హౌస్ లో కంటెస్టెంట్స్ ని రఫ్ ఆడిస్తుందని, తన బోల్డ్ యాటిట్యూడ్ తో ప్రేక్షకులను అలరిస్తుందని అందరూ భావించారు. అనూహ్యంగా సరయు మొదటివారమే ఎలిమినేట్ అయ్యారు.


ప్రేక్షకులు ఆమె ఆటను పూర్తిగా ఆస్వాదించకుండానే ఎలిమినేట్ కావడం జరిగింది. సరయుతో పాటు ఆమె అభిమానులు కూడా ఈ పరిణామానికి చాలా నిరాశపడ్డారు. సరయు ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని అసలు ఊహించలేదని చెప్పడం జరిగింది. 


హౌస్ నుండి బయటికి వచ్చాక షణ్ముఖ్ పై సరయు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆడితే మగాడిలా ఆడు, లేదంటే గాజులు వేసుకుని ఓ మూలన కూర్చో అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ కారణంగా షణ్ముఖ్ ఫ్యాన్స్ సరయుపై సోషల్ మీడియా దాడికి దిగారు. 


హౌస్ లో షణ్ముఖ్ తనను ఎంతలా బాధపెడితే నేను అలాంటి కామెంట్స్ చేశానో మీకు తెలియదన్న సరయు, ఆధారాలతో సహా షణ్ముఖ్ బండారం బయటపెడతానని శపథం చేశారు. తనపై బూతు కామెంట్స్ చేస్తున్న షణ్ముఖ్ ఫ్యాన్స్ కి కూడా వార్నింగ్ ఇచ్చారు. 


కాగా తాజా ఇంటర్వ్యూలో సరయు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని షాకింగ్ నిజాలు వెల్లడించింది. ప్రేమ పెళ్లి, రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ... ఓపెన్ గా టాప్ సీక్రెట్ బట్టబయలు చేసింది. 

సరయు మాట్లాడుతూ 'ఒక వ్యక్తితో ఏడేళ్లు రిలేషన్‌లో ఉన్నాను. అది మా ఇంట్లో వాళ్లకు, అబ్బాయి ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. మా ఇంట్లో వాళ్లకు చెప్పకుండా నేనేదీ చేయను. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు నా కెరీర్‌ను పక్కన పెట్టాను. రిలేషన్‌లో అతడికి 100 పర్సెంట్‌ ఇచ్చేశాను.

నేను వర్జిన్‌ కూడా కాదు. మేము పెళ్లి చేసుకుందామనుకున్నాం, కానీ కుదరలేదు. కట్నం దగ్గర గొడవ రావడంతో పెళ్లిపీటల దాకా వచ్చిన వివాహం రద్దయిపోయింది.

ముందు పాతిక లక్షలు అడిగారు, తర్వాత అరకోటి, కోటి, ఆ తర్వాత సగం ఆస్తి అడిగారు. ఇప్పటినుంచే ఇలా చేస్తే పెళ్లయ్యాక ఇంకెన్ని అడుగుతారో, ఇంకెలా ఉంటారో? అని క్యాన్సిల్‌ చేశాను. నువ్వు నాకు తగినవాడివి కాదని అతడి ముఖం మీదే చెప్పేశాను' అని చెప్పుకొచ్చింది సరయూ.

Latest Videos

click me!