త్రిషను ఆ హీరో అసభ్యంగా తాకినా ఆఫర్ కోసం భరించింది... నటి మీరా మిథున్ షాకింగ్ కామెంట్స్!

Published : Aug 30, 2023, 04:53 PM IST

హీరోయిన్ త్రిషను ఉద్దేశిస్తూ నటి మీరా మిథున్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆఫర్ కోసం ఓ హీరో అసభ్యంగా తాకినా త్రిష భరించింది అన్నారు.   

PREV
16
త్రిషను ఆ హీరో అసభ్యంగా తాకినా ఆఫర్ కోసం భరించింది... నటి మీరా మిథున్ షాకింగ్ కామెంట్స్!

వివాదాలతో వార్తల్లో ఉంటుంది నటి మీరా మిథున్. ఈ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ స్టార్ హీరోలను ఉద్దేశిస్తూ అనుచిత కామెంట్స్ చేశారు. సూర్య విజయ్, త్రిష, జ్యోతిక, రజినీకాంత్ వంటి ప్రముఖులపై ఆమె ఆరోపణలు చేశారు. త్రిషకు క్యాస్ట్ ఫీలింగ్. ఆమె కారణంగా చాలా అవకాశాలు కోల్పోయానని మీరా మిథున్ ఆమెను టార్గెట్ చేయడమైంది.

26

తాజాగా మరోసారి త్రిషను ఉద్దేశిస్తూ మిరా మిథున్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త్రిష హీరోయిన్ గా ఉన్న ఓ చిత్రంలో నేను చిన్న పాత్ర చేశాను. ఆ మూవీ సెట్స్ లో ఓ ప్రముఖ నటుడు త్రిషను తాకకూడని చోట పదే పదే తాకాడు. అది చూసి నాకు చాలా కోపం వచ్చింది. త్రిష కూడా అసౌకర్యంగా ఫీలయ్యింది.

36


అయితే ఆమె మౌనంగా ఉండిపోయింది. అరిచి గోల చేస్తే ఆ సినిమా ఆఫర్ కోల్పోతుంది. అందుకే అసభ్యంగా తాకినా భరించింది. త్రిష వంటి స్టార్ హీరోయిన్ పరిస్థితి అలా ఉంటే, ఇంకా మాలాంటి వాళ్లకు రక్షణ ఏదీ ? అని ఆమె ప్రశ్నించారు. త్రిష పట్ల తప్పుగా ప్రవర్తించిన ఆ ప్రముఖు నటుడు పేరు ఆమె వెల్లడించలేదు. 

46

మీరా మిథున్ కామెంట్స్ వైరల్ అవుతుండగా... ఆమె ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ నటుడు ఎవరనే విశ్లేషణ మొదలైంది. అయితే మీరా మిథున్ అబద్దం కూడా చెప్పి ఉండొచ్చనే వాదన ఉంది. సెన్సేషన్ కోసం మీరా మిథున్ తరచుగా ఇలాంటి చర్యలకు పాల్పడతారు.  

 

56
Meera mitun

బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3లో మీరా మిథున్ పార్టిసిపేట్ చేసింది. అయితే ఆమె అంతగా సక్సెస్ కాలేదు. 7వ వారం 35వ రోజు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది. 2021లో పలు సెక్షన్స్ క్రింద ఆమెపై తమిళనాడు పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు ఛాలెంజ్ విసురుతూ మీరా మిథున్ వీడియో విడుదల చేసింది. 

66
Meera mitun

అదే ఏడాది ఆగస్టు 14న కేరళలో ఆమెను అరెస్ట్ చేశారు. ఆగస్టు 27 వరకు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంది. పోలీసులు తనను వేధించారని ఆమె ఆరోపించారు. ఆగస్టు 26న బెయిల్ రాగా, మరో కేసులో అరెస్ట్ చేసిన జైలుకు పంపారు. 

Read more Photos on
click me!

Recommended Stories