Kaushal:నా అనుభవమంత ఉండదు దీప్తి వయసు నన్ను అంత మాట అంది...బాంబు పేల్చిన బిగ్ బాస్ కౌశల్

Published : Feb 07, 2022, 05:50 PM IST

బిగ్ బాస్ సీజన్ 2 (Bigg boss Telugu) విన్నర్ కౌశల్ మందా యూట్యూబ్ స్టార్ దీప్తి సునైనను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా అనుభవమంత వయసులేని దీప్తి నన్ను అంతమాట అంటుందా అని మండిపడ్డారు. కౌశల్ లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

PREV
16
Kaushal:నా అనుభవమంత ఉండదు దీప్తి వయసు నన్ను అంత మాట అంది...బాంబు పేల్చిన బిగ్ బాస్ కౌశల్

నాని (Nani)హోస్ట్ గా 2018లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ నటుడు కౌశల్ మందా గెలుపొందారు. ఫైనల్ లో సింగర్ గీతామాధురితో పోటీపడ్డ కౌశల్ ప్రేక్షకుల ఓట్లతో టైటిల్ తో పాటు ప్రైజ్ మనీ దక్కించుకున్నారు. అప్పట్లో కౌశల్ పేరు మారుమ్రోగింది. ఆయన పేరున కొన్ని ఆర్మీలు ఏర్పడి క్యాంపైన్స్ నిర్వహించాయి.

26

హౌస్ లో కౌశల్ (Kaushal) చాలా ప్రత్యేకంగా ఉండేవారు. నో రిలేషన్స్, నో ఎమోషన్స్ అనే స్ట్రాటజీతో ఆడి కప్పు గెలుచుకున్నాడు. ఏ ఒక్క కంటెస్టెంట్ తో కౌశల్ స్నేహం చేయలేదు. గేమ్ మాత్రమే ముఖ్యం అన్నట్లు అతని ప్రవర్తన ఉండేది. సామాన్యుడు కేటగిరీలో షోకి ఎంపికైన నూతన్ నాయుడ్ని కొంచెం దగ్గరకు రానిచ్చేవారు.

36

కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కౌశల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ... నా గెలుపుకు కారణమైన వారందరినీ కలిసి కృతజ్ఞతలు తెలిపాను. విదేశాలలో ఉన్నవారు కూడా కొందరు సప్పోర్ట్ చేశారు. వారిని కూడా నేను కలవడం జరిగింది.

46

బిగ్ బాస్ షోకి ఎంపికైన మొదటి టెలివిజన్ ఆర్టిస్ట్ ని నేను. నాతోనే ఈ సాంప్రదాయం మొదలైంది. ఇప్పుడు ప్రతి సీజన్లో కొందరు బుల్లితెర నటులను తీసుకుంటున్నారు. వారందరికి ఆఫర్స్ వస్తున్నాయంటే నావల్లే అని చెప్పొచ్చు. కొన్ని కథల కారణంగా, మరికొన్ని రెమ్యూనరేషన్ నచ్చక సినిమా అవకాశాలు మిస్ అయ్యాయి.

56

నా అనుభవం అంత వయసు కూడా లేని దీప్తి సునైనా నేను రెండు వారాల్లో వెళ్లిపోతానని చెప్పడంతో కౌశల్‌ అంటే ఏంటో నిరూపించాలనుకున్నా. కష్టపడి టైటిల్‌ గెలిచా...  అంటూ కౌశల్ దీప్తి పట్ల తన అసహనం వెళ్లగక్కారు. దీప్తి సీజన్ 2లో పాల్గొన్నారు. దీప్తి 10వ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.

66

మరోవైపు బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన ఫేమ్ కౌశల్ కి అంతగా ఉపయోగపడలేదు. ఆయన కెరీర్ ఏమంత మెరుగు కాలేదు. ఒకవిధంగా చెప్పాలంటే కొంతమేర డౌన్ అయ్యింది. ఇక అప్పుడప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయడం ద్వారా ఆయన వార్తల్లో ఉంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories