కలనెరవేర్చుకున్న జబర్ధస్త్ ఫైమా.. సొంతింట్లో అడుగు పెట్టిన లేడీ కమెడియన్, వైరల్ వీడియో..

First Published | Sep 16, 2023, 2:51 PM IST

ఎట్టకేలకు తన చిరకాల కలను  నెరవేర్చుకుంది బుల్లితెర తార.. లేడీ కమెడియన్ ఫైమా. కష్టాల నుంచి బయటపడి.. కమెడియన్ గా స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తాజాగా సొంతింటిలో అడుగు పెట్టింది.

జబర్థస్త్ లో కామెడీ పంచుల ప్రవాహంతో నవ్వుల పువ్వులు పూయించిన లేడీ కమెడియన్ ఫైమా..బిగ్ బాస్ తో బాగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. జబర్థస్తో తో బాగా డిమాండ్ తెచ్చుకుంది.  బిగ్ బాస్ కు వెళ్ళినప్పుడు తన చిరకాల కోరికను వెల్లడించింది బ్యూటీ.. సొంతిల్లు కట్టుకోవడమే తన జీవిత లక్ష్యం అంటోంది బ్యూటీ. తాజాగా ఆ కోరక నెరవేర్చుకుంది. 

ఈ విష‌యాన్ని త‌న యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా ఫైమా తెలియ‌జేసింది. త‌న చిరకాల కల నెరవేరిందని.. తాజాగా కొత్తింటిల్లోకి అడుగు పెట్టామని చెపుతూ.. తన గృహప్రవేశం వీడియోను వీడియోను అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. అంతు కాదు గృహప్రవేశం వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 
 


ఇక  ఈ వీడియోలో  స్టార్స్ కూడా సందడి చేశారు. ఫైమాతో పాటు పనిచేసిన కమెడియన్లు కూడా ఈ ఈవెంట్ లో హడావిడి చేశారు. అంతే కాదు... ఫైమను తన టీమ్ ద్వారా జబర్ధస్త్ కు పరిచయం చేసిన బుల్లెట్ భాస్కర్  కూడా ఫైమా గృహప్రవేశంలో సందడి చేశాడు. 
 

ఈ సందర్భంగా ఫైమా ఆనందంతో ఏడ్చేసింది. తన త‌ల్లిని పట్టుకుని క‌న్నీళ్లు పెట్టుకుంది. ఫైమా కొత్తింటి గృహ ప్ర‌వేశ కార్య‌క్ర‌మానికి జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్, బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే సూర్య తదితరులు హజరయ్యారు. ఇదిలా ఉంటే.. మూరుమూల పేద కుటుంబం నుంచి వచ్చి.. జబర్దస్త్ కామెడీ షో వల్ల స్టార్ గా మారింది  ఫైమ. జబర్ధస్త్ ఫైమాగా పేరు తెచ్చుకున్న ఈ లేడీ కమెడియన్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. 

అసలే లేడీ కమెడియన్స్ చాలా తక్కువ అటువంటిది అందులో ఫైమా కమెడియన్ గా బాగా  పాపులర్ అయ్యింది. ఫైమాకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. అది బిగ్ బాస్ హౌస్ లో కూడా బాగా ఉపయోగపడింది. ఫైమా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమెకు వారాని రెండున్నార లక్షల రెమ్యూనరేషన్  కూడా ఇచ్చారట బిగ్ బాస్ టీమ్. 
 

లేడీ కమెడియన్ కావడం,పంచులు ప్రాసలు గట్టిగా వేయడం,పైగా పేద కుటుంబం నుంచి రావడం, పేదరికంతో ఇబ్బంది పడుతున్న తమకు ఓ సొంత ఇల్లు కావాలని. బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బుతో ఇల్లు తీసకుంటానని బిగ్ బాస్  స్టేజ్ పైనే చెప్పింది  లేడీ కమెడియన్.

Latest Videos

click me!