అంతా అయిపోయాక వదిలేస్తారు, కొత్త వాళ్ళను చూసుకుంటారు... బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ ఓపెన్ కామెంట్స్ 

Published : Mar 07, 2024, 08:03 AM IST

ప్రేమలో ఉన్న వారికి  గీతూ రాయల్ ఓ సలహా ఇచ్చింది. నిజమైన ప్రేమను ఏమిటో తెలుసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. లేదంటే వాడుకుని వదిలేస్తారని ఆమె వెల్లడించారు.   

PREV
16
అంతా అయిపోయాక వదిలేస్తారు, కొత్త వాళ్ళను చూసుకుంటారు... బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ ఓపెన్ కామెంట్స్ 


బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి వారాల్లో ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది. అయితే ఓవర్ యాక్షన్ ఎక్కువ కావడంతో జనాలు ఇంటికి పంపేశారు. 9వ వారం గీతూ రాయల్ ఎలిమినేట్ అయ్యింది. 

26

ఊహించని ఈ పరిణామంతో ఆమె కన్నీరు మున్నీరు అయ్యింది. రీ ఎంట్రీ ఉంటుందని చాలా ఆశించింది. కానీ కుదర్లేదు. కాగా బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ ని గీతూ రాయల్ ఇంటర్వ్యూ చేసింది. బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా ఆమె వ్యవహరించిన సంగతి తెలిసిందే. 

 

36

గీతూ రాయల్ ఓపెన్ గా ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడుతుంది. కాగా ఆమె ప్రేమికులకు విలువైన సలహా ఇచ్చింది. గీతూ రాయల్ మాట్లాడుతూ... మొదట్లో ప్రేమ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆరు నెలలు హనీ మూన్ లాంటిది. ఒకరి మీద మరొకరు చాలా ప్రేమ చూపించుకుంటారు. అయితే అది నిజమైన ప్రేమ కాదు. 

46

నిజమైన ప్రేమ ఏమిటో తెలియాలంటే కనీసం ఆరు నెలలు వేచి చూడాలి. అప్పటి వరకు ఉండేది వ్యామోహం మాత్రమే. అన్నీ అయిపోయాక మనం బోర్ కొట్టేస్తాం. అప్పుడు కొత్త వాళ్ళ కోసం వెతుక్కుంటారు. కాబట్టి... ఆరు నెలల తర్వాత కూడా మనతో మొదట్లో వలె ప్రేమగా ఉంటే అది నిజమైన ప్రేమ అనుకోవచ్చు. 

56

ప్రేమికులకు నేనిచ్చే ఉచిత సలహా అంటూ చిన్న క్లాస్ పీకింది. గీతూ రాయల్ కామెంట్స్ నేపథ్యంలో ఆమెకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నీకు ఇలాంటి అనుభవం ఎదురైందా అని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి అనుభవ పూర్వకంగా గీతూ రాయల్ ఈ కామెంట్స్ చేసిందా లేక, ఇతరుల జీవితాలు గమనించడం ద్వారా తెలుసుకుందో తెలియాల్సి ఉంది. 

 

66

2021లో గీతూ రాయల్ వికాస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒకే ఊరిలో పెరిగారు. వికాస్, గీతూ బాల్యం నుండి కలిసి పెరిగారట. ఇక బిగ్ బాస్ ఫినాలే రోజు గీతూ రాయల్ కారుపైన దాడి జరిగింది. కొందరు దుండగులు అద్దాలు పగలగొట్టారు. 

click me!

Recommended Stories