అనారోగ్యం బారిన పడిన అరియనా... ఆందోళనలో ఫ్యాన్స్, త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు!

Published : May 11, 2023, 03:19 PM IST

అరియనా గ్లోరీ అనారోగ్యం బారిన పడ్డారు. ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ విషయం తెలియజేశారు. అరియనా త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.   

PREV
16
అనారోగ్యం బారిన పడిన అరియనా... ఆందోళనలో ఫ్యాన్స్, త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు!
Ariyana Glory

బిగ్ బాస్ ఫేమ్ అరియనా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో అనారోగ్యానికి గురైనట్లు వెల్లడించారు. చాలా రోజులుగా బాధపడుతున్నాను. ఎప్పుడు రికవర్ అవుతానేమో అని అరియనా వేదన వ్యక్తం చేశారు. అరియనా వీడియో చూసి ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.

26
Ariyana Glory

అరియనా చేతికి సిరంజి కూడా ఉంది. ఆమెకున్న అనారోగ్య సమస్య ఏంటనేది తెలియదు. అరియనాకు బిగ్ బాస్ షో పాపులారిటీ తెచ్చింది. అరియనా ముక్కుసూటితనం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్త్వం ఆమెను ఇష్టపడేలా చేశాయి. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓ దశలో ఆమె టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యారు. ఫైనల్ లో అనూహ్యంగా వెనుకబడ్డారు.
 

36
Ariyana Glory


బిగ్ బాస్ తర్వాత ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. కెరీర్ లో సెట్ అయ్యింది. ఇక లైఫ్ ఇచ్చిన వర్మ కోసం అరియనా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తూ వర్మ అడిగే పచ్చి బూతు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అరియనా ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ ఆ ఇంటర్వ్యూలో వర్మ రచ్చ చేశారు. 

46


ఇటీవల అరియనా బీబీ జోడిలో కంటెస్ట్ చేశారు. మాజీ బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ జోడీలు ఏర్పడి చేసిన ఈ షో సక్సెస్ అయ్యింది. అరియనా-అవినాష్ జోడి ఫైనల్ కి వెళ్లడం విశేషం. అనూహ్యంగా అరియనా జోడి  ఫైమా-సూర్య జోడీ చేతిలో ఓడిపోయారు. విన్నర్స్ గా ఫైమా-సూర్య రూ. 25  లక్షలు కైవసం చేసుకున్నారు.
 

56

కాగా అరియనా ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆమె చేసిన సోషల్ మీడియా కామెంట్స్ దానికి కారణమయ్యాయి.  'ఒకరిని ప్రేమించాలనే భావన లేకుండా ప్రేమలో పడిపోతాం. అదే నిజమైన ప్రేమ. ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది...' అంటూ కామెంట్ పెట్టారు. అరియనా ప్రేమ కథలు వల్లిస్తున్న నేపథ్యంలో ఆమె రిలేషన్ లో ఉన్నారని కొందరు అంచనా వేస్తున్నారు. ఆ లక్కీ ఫెలో ఎవరని అడుగుతున్నారు. 
 

66


గతంలో అరియనా మ్యారేజ్ పై తన అభిప్రాయం చెప్పారు. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుని సెటిలైపోతాను. భార్యగా మారి పిల్లల్ని కని వారి ఆలనా పాలనా చూసుకోవడం, భర్తకు సేవలు చేయడం ఇష్టమని చెప్పారు. ఆ మాటలు చెప్పి చాలా కాలం అవుతుండగా అరియనా మాత్రం వివాహం చేసుకోలేదు. 
 

Read more Photos on
click me!

Recommended Stories