ఎక్కువగా అమ్మ రాజశేఖర్ తో స్నేహం చేసింది. ఆ కారణంగా దివి కనీసం ఫైనల్ కి కూడా చేరుకోలేదు. షో మధ్యలోనే ఆమె ఆట ముగిసింది. ఆ సీజన్ లో అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అఖిల్ రన్నర్ గా నిలిచారు. అరియానా, సోహైల్, అలేఖ్య ఫైనల్ కి చేరారు. ఫైనల్ కి చేరకున్నా దివికి మాత్రం ఫేమ్ దక్కింది. బిగ్ బాస్ షో తర్వాత ఆమెకు ఆఫర్స్ మొదలయ్యాయి. గతంతో పోల్చితే ఆమెకు లీడ్ హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం లంబసింగి టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. అలాగే ఏటీఎం టైటిల్ తో ఓ వెబ్ సీరీస్ చేస్తున్నారు.