బౌండరీలు బ్రేక్‌ చేసిన బిగ్‌ బాస్‌ బ్యూటీ.. జాకెట్‌ లేకుండా స్లీవ్‌లెస్‌ గౌనులో సిరి హోయలు.. బర్త్ డే ట్రీట్‌

Published : Jan 05, 2023, 09:48 AM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ సిరి హన్మంతు సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంటుంది. అడపాదడపా గ్లామర్‌ షో చేస్తుంది.అయితే హాట్‌ డోస్ గట్టిగానే దట్టిస్తుంది. హీరోయిన్లని మించి షో చేస్తూ రచ్చ చేస్తుంది. 

PREV
19
బౌండరీలు బ్రేక్‌ చేసిన బిగ్‌ బాస్‌ బ్యూటీ.. జాకెట్‌ లేకుండా స్లీవ్‌లెస్‌ గౌనులో సిరి హోయలు.. బర్త్ డే ట్రీట్‌

యూట్యూబర్‌గా, నటిగా, యాంకర్ గా రాణించిన, రాణిస్తున్న సిరి హన్మంతు(Siri Hanumanth) గత బిగ్‌ బాస్‌ షో(ఐదో సీజన్‌)తో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. క్రమ క్రమంగా గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అవుతుంది. తాజాగా ఆమె ఫోటో షూట్‌ పిక్స్ బౌండరీలు బ్రేక్ చేసేలా ఉండటం విశేషం. 
 

29

స్లీవ్స్ జబ్బలపై జారిపోతుండగా, బ్లూ ట్రెండీ వేర్ ధరించి హోయలు పోయింది. టాప్‌ షో చేస్తూ పిచ్చెక్కించింది. కొంటెగా చూస్తూ క్యూట్‌ స్మైల్‌తో ఫిదా చేస్తుంది. అప్సరసలా అందాల విందు చేస్తూ ఇంటర్నెట్‌ని బ్లాస్ట్ చేసింది. గతంలో ఓ సారిలా ఇలాంటి పోజులిచ్చింది సిరి. మళ్లీ మరోసారి రెచ్చిపోయింది. 

39

సోషల్‌ మీడియాలో తన బర్త్ డే వేళ బ్లాస్ట్ అయ్యింది. మంగళవారం(జనవరి 3)న బర్త్ డే చేసుకుంది సిరి. ఈ సందర్భంగా ఆమె అందంగా ముస్తాబై కనువిందు చేసింది. ఆ సమయంలో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి వైరల్‌ అవుతున్నాయి. 
 

49

తన బర్త్ డేని చాలా స్పెషల్‌గా మార్చిన ఫ్యాన్స్ కి, ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి ఆమె ధన్యవాదాలు తెలిపింది. అదే సమయంలో అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. ఇంతటి గ్లామర్‌ షో చేస్తూ సిరి ఫోటోలు పంచుకోవడంతో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు.

59

అయితే ఇందులో చూడ్డానికి సిరి హీరోయిన్‌ లా కనిపించడం విశేషం. దీంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. హీరోయిన్‌ మెటీరియల్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అందం, హాట్‌నెస్‌, టాలెంట్‌ మేళవించిన గ్లామర్‌ బ్యూటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు.
 

69

సిరి హన్మంతు బిగ్‌ బాస్‌ ఐదో సీజన్‌లో పాల్గొని ఆకట్టుకుంది. ఇందులో మేల్స్ కంటెస్టెంట్లకి దీటుగా రాణించింది. ముఖ్యంగా షణ్ముఖ్‌ జస్వంత్‌తో కలిసి ఆమె గేమ్‌ ఆడుతూ అదరగొట్టింది. అదే సమయంలో షణ్ముఖ్‌ మనస్తత్వం విషయంలో చాలా ఇబ్బంది పడింది. సిరికి షణ్ముఖ్ ఎమోషనల్‌గా కనెక్ట్ కావడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. రచ్చ రచ్చ లేపింది.
 

79

అదే చివరికి షణ్ముఖ్‌ ప్రియురాలు దీప్తి సునైనా బ్రేకప్‌ చెప్పేంత వరకు వెళ్లడం గమనార్హం. అయితే ఈ విషయంలో సిరి తప్పేమీ లేదు. ఆమె ప్రతి సారి షణ్ముఖ్‌తో వారిస్తూనే ఉంది. కానీ అతను అలా ప్రవర్తించడమే వివాదానికి కారణమైంది. 
 

89

ఏదేమైనా తన ప్రియుడితో హ్యాపీగా ఉంది సిరి. శ్రీహాన్‌, సిరి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. కలిసే ఉంటున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. శ్రీహాన్‌ ఈ ఆరో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. నిజానికి ఓట్ల పరంగా అతనే విన్నర్‌ అని నాగార్జున ప్రకటించారు. నాగ్‌ ఆఫర్‌కి టెంప్ట్ అయి కప్‌ మిస్‌ అయిపోయాడు. రేవంత్‌ జాక్‌ పాట్‌ కొట్టేలా చేశాడు. 
 

99

సిరి బిగ్‌ బాస్‌ నుంచి వచ్చాక మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఆమె వరుసగా టీవీ షోస్‌లో పాల్గొంటూ సందడి చేస్తుంది. వీడియోలు, సాంగ్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. మరోవైపు యాంకర్‌ రవితో కలిసి యాంకరింగ్‌ చేస్తుంది సిరి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories