
ఈరోజు ఎపిసోడ్ లో వెళ్దాం పదండి ఇలాంటి వాళ్ళ సంగతి ఆ దేవుడే చూసుకుంటారు అనడంతో ఇంతలోనే ఒక ఆమె వచ్చే క్షమించండి అని చెప్పి పరంధామయ్య వాళ్లకు ప్రసాదం ఇస్తుంది. అది చూసిన తులసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత లాస్య సంతోష పడుతూ ఈరోజు నా జీవితంలో అదృష్టం కలిసి వస్తుందని ఉంది ఎలా వస్తుందో అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు లాస్యకు బెనర్జీ ఫోన్ చేస్తాడు. ఎవరు మాట్లాడేది అనడంతో నీ శ్రేయోభిలాషిని నీ మంచి కోరుకునే వారు అనడంతో అలాంటి వారు నాకు ఎవరూ లేరు అని అంటుంది లాస్య. అప్పుడు బెనర్జీ ఏం కావాలి అని అంతో ఒక ప్రాజెక్టు ఉంది ఆ ప్రాజెక్టుని మీరు డీల్ చేసి పెట్టాలి అనడంతో లాస్య ఆశ్చర్య పోతుంది.
మీరు చెప్పింది నాకేం అర్థం కాలేదు అనడంతో మీ గురించి అన్ని తెలుసుకునే నేను మాట్లాడుతున్నాను అని అంటాడు బెనర్జీ. మీరు ఊహించని ఆఫర్ ఇవ్వబోతున్నాను. నీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అవ్వబోతుంది అనడంతో లాస్య ఏ సంతోష పడుతూ ఉంటుంది. ఆఫీస్ అడ్రస్ పంపిస్తాను అక్కడికి వచ్చేయండి అడ్రస్ పంపిస్తున్న చూడు అనడంతో లాస్య సంతోష పడుతూ ఉంటుంది. మరోవైపు అనసూయ జరిగిన విషయాన్ని తలుచుకొని బాధపడుతూ గుడి కాబట్టి సరిపోయింది లేకపోతే వాడు చెంప పగలగొట్టే వాడిని దాన్ని అని అంటుంది. ముష్టి వాడికి ఇచ్చే మర్యాద కూడా నీకు ఇవ్వలేదు మిమ్మల్ని చూసి వాడు ఆ మాట ఎలా అనగలిగాడు అనీ బాధతో మాట్లాడుతుండగా అది చూసి తులసి సామ్రాట్ కూడా బాధపడుతూ ఉంటారు.
ఇంట్లో మాటలు పడి పడి ఆ లాస్య మాటలు అవమానాలు భరించి మనసు చచ్చిపోయిందేమో అనసూయ అని అంటాడు. మన తులసి ఎప్పుడూ మనల్ని అవమానించలేదు మనం బాధపెట్టామే కానీ మన తులసి ఎప్పుడు మనల్ని బాధ పెట్టలేదు. మన గురించి మనం ఎప్పుడు ఆలోచించుకోలేదు. కానీ ప్రస్తుతం పాలు లేకుండా కేవలం డికాషన్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది అనసూయ అనడంతో తులసి బాధపడుతూ ఉంటుంది. నేను తులసికి మన కష్టాల గురించి చెబుతాను అంటే చెప్పనివ్వకుండా నా నోరు నొక్కేశారు అనడంతో తులసి మన కష్టాలు తెలుసుకొని ఏం చేస్తుంది అనసూయ మన పక్కన కూర్చుని బాధపడుతుంది అంతే కదా అని అంటాడు పరంధామయ్య. ఎన్ని జరిగిన ఎప్పటికైనా ఏదో ఒక రోజు మంచి జరుగుతుందని ఆశిస్తూ బరిద్దాము అంటాడు పరంధామయ్య.
ఈ విషయాలు ఏవి తులసికి తెలియనివ్వకూడదు అనడంతో తులసి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు పరంధామయ్య అనసూయ ప్రసాదం కూడా తినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు లాస్య సంతోషంతో బెనర్జీ దగ్గరికి బయలుదేరగా ఎక్కడికి వెళ్తున్నావు అని నందు అడగడంతో వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని నీకు తెలియదా అని అంటుంది లాస్య. అప్పుడు లాస్య అబద్ధాలు చెప్పి నందు పై సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు తులసి జరిగిన విషయాలు తెలుసుకుని కుమిలిపోతూ ఉంటుంది. తులసి గారు వాళ్ళు అన్ని మాటలు మాట్లాడి బాధపడుతున్న కూడా దూరం నుంచి చూస్తూ ఉండిపోయారు దగ్గరికి వెళ్లి ఓదార్చ వచ్చు కదా నేను మీ స్థానంలో ఉండి ఉంటే నా ఇంటికి తీసుకెళ్లి నాతో మా ఇంట్లోనే పెట్టుకునే వాడిని అనడంతో దూరం చేయడం ఈజీ సామ్రాట్ గారు కానీ కుటుంబాన్ని అంతా ఒకచోట దగ్గరగా ఉంచడం చాలా కష్టం ఉంటుంది తులసి.
అప్పుడు సామ్రాట్ వెళ్దాం పదండి వెళ్లి మీ అత్తయ్య మామయ్యని మనతో పాటు తీసుకెళ్దాం అనడంతో తులసి అడ్డుపడుతుంది. నా అనుమానం వల్ల ఒకటే లాస్య చేసే పనులేవీ నందగోపాల్ గారికి తెలియక ఉండకపోవచ్చు అందుకే తన ఆటలు ఇంకా సాగుతున్నాయి అనుకుంటూ తులసి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. మరొకవైపు లాస్య, బెనర్జీని కలవడానికి వెళుతుంది. అప్పుడు బెనర్జీ దగ్గర సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. మీరు చాలా తెలివైన వ్యక్తి కానీ మీకు సరైన అవకాశాలు లేక అంధకారంలో ఉన్నారు అని లాస్యకు బిస్కెట్లు వేయడంతో లాస్య సంతోష పడుతూ మీరు చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు అంటుంది. అప్పుడు బెనర్జీ మాటలకు ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత అసలు విషయం చెప్పడంతో లాస్య ఆ ప్రాజెక్టు చేయడానికి ఓకే చెబుతుంది.
నందగోపాల్ గారిని తీసుకొని రండి అందుకు సంబంధించిన వివరాలు మొత్తం ప్లాన్ అన్ని వర్కౌట్ చేద్దాము అని అనడంతో లాస్య సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు తులసి ఇంట్లో వారి కోసం సరుకులు మొత్తం తీసుకుని వెళుతుంది. తులసీని చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు ఇంటికి వచ్చిన గెస్ట్ కి మంచినీళ్లు కూడా ఇవ్వరా అని అనగా అంకిత వెళ్తూ లాస్యను చూసి మధ్యలోనే ఆగిపోతుంది. ఈ సరుకులు ఏంటి ఈ హంగామా ఏంటి నాకు తెలియకుండా నా ఇంట్లోకి సరుకులు ఎవరు తెప్పించారు అని అనగా నేనే తెప్పించాను నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది తులసి. మా ఇంట్లో మా సరుకులు తెప్పించుకోవాలి ఎలా వాడుకోవాలి అని మాకు ప్లాన్లు ఉంటాయి తెప్పించడానికి నువ్వు ఎవరు అని అంటుంది లాస్య. ఇంతలోనే నందు అక్కడికి వస్తాడు.
అప్పుడు తులసి ఈ సరుకులన్నీ నా డబ్బులతో నేనే తీసుకొచ్చాను ఎవరు నన్ను అడగలేదు అంటుంది తులసి. ఇంటికి సరుకులు తీసుకుని రావాల్సిన అవసరం నీకేంటి అని నంద గోపాల్ అనడంతో మా వాళ్ళు ఇంట్లో తిండికి ఇబ్బంది పడకూడదని ముందే జాగ్రత్త పడుతున్నాను అంటుంది తులసి. అప్పుడు నందు అసలు విషయం తెలియక నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు తులసి ఎక్కువ మాట్లాడుతున్నావు ఇవి తీసుకుని బయటికి వెళ్ళు అనడంతో ఇప్పుడే ఇంట్లో ఏం జరుగుతుందో నిరూపిస్తాను అనడంతో తన బండారం మొత్తం బయటపడుతుందనుకున్న లాస్య కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
అప్పుడు నందగోపాల అడ్డుపడకు అని అంటాడు. తులసి శృతిని కప్పు కాఫీ ఇవ్వమని అనడంతో అందరూ లాస్య వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు లాస్య నేను తీసుకొని వస్తాను అనడంతో నువ్వు వద్దు అంకిత నువ్వు వెళ్ళు అని అంటుంది తులసి. నేను కాదు శృతి ఎవరు వెళ్లినా కాలి చేతులతో రావాలి అని అంకిత అనడంతో ఎందుకు అంకిత అని నందు అడగగా ఫ్రిడ్జ్ తో పాటు మొత్తం రాక్స్ కి అన్నింటికి కీస్ వేసుకొని లాస్య ఆంటీ తన దగ్గరే పెట్టుకుంది అనడంతో నందు షాక్ అవుతాడు.