Bigg Boss Telugu 7: దామిని నన్ను తోలుబొమ్మలా ఆడించింది.. కిరణ్‌ రాథోర్‌ కామెంట్స్.. నెక్ట్స్ ఎలిమినేషన్‌ అతడే?

కిరణ్‌ రాథోర్‌ బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌లో మొదటి నామినేషన్‌గా నిలిచారు. అయితే ఆమె బిగ్‌ బాస్‌ బజ్‌ లో మాత్రం పలు హట్‌ కామెంట్స్ చేశారు.  షాకింగ్‌ విషయాలను బయటపెట్టారు.

bigg boss 7 first eliminater kiran rathore shocking comments on damini and revealed next elimination arj

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ ప్రారంభమై వారం రోజులు గడిచిపోయింది. తొలి ఎలిమినేషన్‌ కూడా జరిగింది. నటి, గ్లామర్‌ బ్యూటీ కిరణ్‌ రాథోర్‌ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ వారం తక్కువ ఓట్లతో ఆమె ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఆమె హౌజ్‌లో సరైన ఆట తీరు కనబర్చలేక బిగ్‌ బాస్‌ షోని వీడాల్సి వచ్చింది. అయితే ఎలిమినేషన్‌ తర్వాత `బిగ్‌ బాస్‌ బజ్‌`లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బోల్డ్ గా రియాక్ట్ అయ్యారు. గత సీజన్‌ క్రేజీ కంటెస్టెంట్‌ గీతూ రాయల్‌ హోస్ట్ గా ఈ బజ్‌ ఎపిసోడ్‌ని నిర్వహిస్తున్నారు. 
 

bigg boss 7 first eliminater kiran rathore shocking comments on damini and revealed next elimination arj

ఇందులో గీతూ బోల్డ్ గా ప్రశ్నలు సంధించగా, అంతే బోల్డ్ గా రియాక్ట్ అయ్యింది కిరణ్‌ రాథోర్‌. దామిని గురించి షాకింగ్‌ కామెంట్స్ చేసింది. అదే సమయంలో తాను తన ఆటని ఆడలేకపోయానని తెలిపింది. అంతేకాదు వచ్చే వారం హౌజ్‌ని వీడేదెవరో కూడా ఆమె ప్రెడిక్షన్‌ ఇచ్చింది. ఇక ఇందులో ఆమె మాట్లాడుతూ జనాలు తనని తొందరగా ఇంటి నుంచి పంపించాలని అనుకున్నారు. అందుకే వచ్చేశా అని చెప్పింది. సోషల్‌ మీడియాలో టూ హాట్‌గా, సెక్సీగా ఉండే మీరు హౌజ్‌లో మాత్రం అలా లేరు ఎందుకని గీతూ రాయల్‌ ప్రశ్నించగా..
 


ఇది ఫ్యామిలీ షో అని, అలా చేయకూడదని దామిని చెప్పిందని పేర్కొంది. అంటే దామిని ఆడించిన తోలు బొమ్మ మీరు అని గీతూ ప్రశ్నించగా, అవును నిజమే అంటూ సమాధానమిచ్చింది కిరణ్‌ రాథోర్‌. మీరు వీక్‌ అని మీరే ఒప్పుకుంటున్నారని అడగ్గా, అది కరెక్ట్ అంటూ ఆమె ఆన్సర్‌ ఇవ్వడం షాక్‌కి గురి చేస్తుంది. మీ నుంచి ఆడియెన్స్ కోరుకున్నది మీరు ఇవ్వకపోవడం వల్లే మీరిక్కడ ఉన్నారని అనగా, ఆ విషయం ఇప్పుడు రియలైజ్‌ అయినట్టు చెప్పింది కిరణ్‌.
 

మళ్లీ అవకాశం ఇస్తే మీలో మీరు ఏం మార్చుకుంటారని అడగ్గా.. తెలుగు నేర్చుకుంటానని, ఫైట్‌ చేస్తానని, మళ్లీ హౌజ్‌లోకి వెళ్లాలని ఉందని తెలిపింది. గౌతమ్‌ కృష్ణ నెక్ట్స్ ఎలిమినేషన్‌ అని చెబుతూ షాకిచ్చింది. మరి తన ప్రిడిక్షన్‌ నిజమవుతుందా? ఏం జరుగుతుందనేది చూడాలి. ఇక తనకు నచ్చిన వాళ్లు షకీలా, శుభ శ్రీ, శివాజీ అని, నచ్చని వాళ్లు తేజ, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్‌ అని చెప్పింది. 

ఇక 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన హౌజ్‌.. ఒకరు ఎలిమినేషన్‌తో 13 మందికి చేరింది. మధ్యలో మరో ముగ్గురు నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిసింది. ఇక హౌజ్‌లో కొరియోగ్రాఫర్‌ ఆట సందీప్‌ పవర్ అస్త్రని సాధించి ఐదు వారాల ఇమ్యూనిటీని పొందారు. హౌజ్‌లో కన్ఫమ్‌ అయిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచారు. నాగార్జున హోస్ట్ గా స్టార్‌ మాలో రన్‌ అయ్యే బిగ్‌ బాస్‌ తెలుగు 7.. డిస్నీ 24గంటలు ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.

Latest Videos

vuukle one pixel image
click me!