అనంతరం.. సూర్య ఫుడ్ పడేయడంతో తీవ్రంగా క్లాస్ పీకాడు. కెప్టెన్‌గా ఆదిరెడ్డి విఫలమయ్యాడని, అదే సమయంలో ఆరోహిపై కోపంతో తాను ఫుడ్ పడేసినట్టు చెప్పిన సూర్యకి గట్టిగా క్లాస్ పీకాడు. ఇందులో ఆరోహి,సూర్యల లవ్ స్టోరీ బయటపెట్టించాడు నాగార్జున. ఫుడ్ విషయంలో ఆరోహి,సూర్యల మధ్య కెమిస్ట్రీ గురించి చెబుతూ, కలవరించిన పేర్లని బయటపెట్టించారు. ఆరోహికి నందు అనే లవర్ ఉన్నాడని, సూర్యకి బుజ్జమ్మ ఉందని వారిచేతే చెప్పించాడు. దీంతో ఇప్పటి వరకు తమ మధ్య ఏదో ఉందని అనుకున్నారని, దీంతో అన్నీ క్లీయర్ అయ్యాయని ఆరోహి అనడం విశేషం.