బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ వైరల్.. ఈసారి ఎంతమందో తెలుసా, చేపల మార్కెట్ నయం అంటూ..

First Published Sep 3, 2022, 11:58 AM IST

సెప్టెంబర్ 4న ఆదివారం బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 6పై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. 

తెలుగు బిగ్ బాస్ షోకి కింగ్ నాగార్జున పర్మనంట్ హోస్ట్ గా మారిపోయారు. తొలి సీజన్ కి ఎన్టీఆర్, రెండవ సీజన్ కి నాని హోస్ట్ గా చేశారు. ఇక మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. సెప్టెంబర్ 4న ఆదివారం బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 6పై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. 

ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొందరి పేర్ల వైరల్ అవుతున్నాయి. ఏకంగా 20 కంటెస్టెంట్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఆ జాబితాలో.. ఇండియన్ ఐడల్ సింగర్ రేవంత్, బుల్లితెర నటులు రియల్ లైఫ్ కపుల్ రోహిత్ -మరీనా, నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ పింకీ సుదీప, యూట్యూబర్ గీతురాయల్ , జబర్దస్త్ చలాకి చంటి, నటుడు బాల ఆదిత్య, యూట్యూబర్ ఆది రెడ్డి, నటుడు ఆర్జే సూర్య, నాటి వాసంతి, నటి సుల్తానా, జబర్దస్త్ ఫైమా, యాంకర్ ఆరోహి, యూట్యూబర్ శ్రీహాన్, నటి శ్రీసత్య, నటుడు అర్జున్ కళ్యాణ్, నటి కీర్తి భట్, యాంకర్ నేహా చౌదరి, నటుడు సుహాన్ని సల్మాన్, నటి అభినయ, మోడల్ రాజా శేఖర్ పేర్లు ఉన్నాయి. వీరిలో కొందరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్లనున్నారట. 

ఒక లిమిట్ లేకుండా 20 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుండడంతో విమర్శలు ఎదురవుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ కంటే చేపల మార్కెట్ బెటర్ అని ఆడియన్స్ ఫీల్ అవుతారని నెటిజన్లు అంటున్నారు. అసలు ఇంతమంది పేర్లు నాగార్జునకి గుర్తుంటాయా అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ సారి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్న వారిలో చెప్పుకోదగ్గ సెలెబ్రిటీలు చాలా తక్కువ. చలాకి చంటి, బాలాదిత్య, సింగర్ రేవంత్, నటి పింకీ సుదీప , నాటి అభినయ మినహా మిగిలిన వాళ్ళెవరూ అంత పాపులర్ కాదు. 

పాపులర్ సెలెబ్రటీలు లేకపోతే టీఆర్పీలు రావడం కూడా కష్టమే అంటున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోపల హంగులు తప్ప.. నిర్వహించే గేమ్స్, టాస్కులు, ఆ గొడవల్లో ఎలాంటి తేడా ఉండడం లేదు. దీనితో బిగ్ బాస్ అభిమానులకు తప్ప కామన్ ఆడియన్స్ కి షోపై ఆసక్తి తగ్గిపోతోంది. 

ప్రతి సీజన్ లో అవే టాస్కులు, గేమ్స్ రిపీట్ అవుతున్నాయి. మొదటి రోజు నుంచే కంటెస్టెంట్స్ గ్రూపులుగా విడిపోయి గొడవలు పడుతుంటారు. ఇదే ఎంటర్టైన్మెంట్ అనే విధంగా నిర్వాహకులు షోని ప్రేక్షకులపై రుద్దడం చూస్తూనే ఉన్నాం. కనీసం సీజన్ 6లో అయినా కాస్త వైవిధ్యం చూపిస్తారేమో చూడాలి. 

click me!