Bigg Boss 5 winner Sunny: షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ లని నామినేట్ చేసిన సన్నీ.. ముగ్గురికీ ఛాలెంజ్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 23, 2021, 07:00 PM ISTUpdated : Dec 23, 2021, 07:04 PM IST

బిగ్ బాస్ ముగిసినా ఇంకా సన్నీ నామినేట్ చేయడం ఏంటి అనుకుంటున్నారట. సన్నీ నామినేట్ చేసింది నిజమే కానీ.. ఇది బిగ్ బాస్ కి సంబంధించిన నామినేషన్ కాదు. 

PREV
16
Bigg Boss 5 winner Sunny: షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ లని నామినేట్ చేసిన సన్నీ.. ముగ్గురికీ ఛాలెంజ్

బిగ్ బాస్ ముగిసినా ఇంకా సన్నీ నామినేట్ చేయడం ఏంటి అనుకుంటున్నారట. సన్నీ నామినేట్ చేసింది నిజమే కానీ.. ఇది బిగ్ బాస్ కి సంబంధించిన నామినేషన్ కాదు. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5 లో సన్నీ విజేతగా నిలిచాడు. రన్నరప్ గా షణ్ముఖ్ నిలిచాడు. 

 

26

బిగ్ బాస్ విజేతగా నిలవడంతో సన్నీ ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ సెలెబ్రిటీగా మారిపోయాడు. తాజాగా సన్నీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. ఇందులో భాగంగానే సన్నీ.. షణ్ముఖ్. సిరి, శ్రీరామ్ లని నామినేట్ చేయడం జరిగింది. 

36

రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జర్నలిస్ట్ కాలనీ లోని జి.హెచ్.ఎం.సి పార్క్ లో  సన్నీ తన స్నేహితులతో కలసి పాల్గొన్నాడు. 

46

ఈ సందర్భంగా వి.జె సన్నీ  మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని సన్నీ కొనియాడారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక తొలిసారి తనకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనే అవకావం ఇచ్చిన సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు అని సన్నీ తెలిపాడు. 

56

సన్నీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మరో ముగ్గురిని నామినేట్ చేశాడు. సన్నీ నామినేట్ చేసింది ఎవరినో కాదు.. రన్నరప్ గా నిలిచిన షణ్ముఖ్, మూడవస్థానం లో నిలిచిన సింగర్ శ్రీరామ్ లతో పాటు సిరిని కూడా నామినేట్ చేశాడు. 

66

మరి సన్నీ ఛాలెంజ్ ని వారు ముగ్గురూ స్వీకరిస్తారో లేదో చూడాలి. తీవ్ర ఉత్కంఠ నడుమ సన్నీ బిగ్ బాస్ లో విజేతగా నిలిచాడు. సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కానీ విజయం చివరకు సన్నీనే వరించింది. 

click me!

Recommended Stories