దీనితో మానస్ తనకు పోటీగా సన్నీని ఎంచుకుంటాడు. టాస్క్ ముగిసేసమయానికి ఎవరు ఎక్కువగా న్యుడిల్స్ తింటారో వారు విజేత. వాళ్లకు 5 ఎక్స్ట్రా ఎగ్స్ లభిస్తాయి. ఈ పోటీలో సన్నీ విజయం సాధిస్తాడు. ఇక ఎగ్స్ టాస్క్ లో మానస్, విశ్వ, సన్నీ, శ్రీరామ్, రవి ఎక్కువ ఎగ్స్ తో కెప్టెన్సీ పోటీ దారులుగా అర్హత సాధించినట్లు బిగ్ బాస్ ప్రకటిస్తారు. సీక్రెట్ టాస్క్ ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో జెస్సి కెప్టెన్సీ టాస్క్ లో నేరుగా ఎంపికయ్యే అవకాశం కోల్పోయినట్లు బిగ్ బాస్ ప్రకటిస్తారు. ఇంతలో హౌస్ లో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. లోబో ఎలిమినేట్ అయ్యాడని అనుకుంటున్న ఇంటి సభ్యులకు స్వీట్ షాక్.