సడెన్‌గా తెరపైకి `బిగ్ బాస్‌` విన్నర్‌.. 250 కోట్లతో పాన్‌ ఇండియా సినిమా .. గ్యాప్‌ ఎందుకొచ్చిందంటే?

Published : Dec 26, 2023, 01:50 PM ISTUpdated : Dec 26, 2023, 03:55 PM IST

`బిగ్‌ బాస్‌ 2` విన్నర్‌ కౌశల్‌ మందా దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ మీడియా ముందుకొచ్చాడు. అంతేకాదు ఏకంగా పాన్‌ ఇండియా మూవీని ప్రకటించిన షాకిచ్చాడు.   

PREV
16
సడెన్‌గా తెరపైకి `బిగ్ బాస్‌` విన్నర్‌.. 250 కోట్లతో పాన్‌ ఇండియా సినిమా .. గ్యాప్‌ ఎందుకొచ్చిందంటే?

`బిగ్‌ బాస్‌ 2` విన్నర్‌ కౌశల్‌ మందా.. `కౌశల్‌ ఆర్మీ`తో అప్పట్లో రచ్చ చేశాడు. ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత సైలెంట్‌ అయిపోయాడు. ఏమైపోయాడో తెలియదు. ఇప్పుడు సడెన్‌గా మెరిశాడు. ఒక్కసారిగా వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాదు ఆయన సంచలన విషయాన్ని ప్రకటించాడు. దాదాపు నాలుగేళ్లుగా కనిపించకుండాపోయిన కౌశల్‌ మందా ఇప్పుడు అందరికి షాకించే విషయాన్ని వెల్లడించారు. 
 

26

కౌశల్‌ మందా.. సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. జెమినీ టీవీలో చాలా సీరియల్స్ చేశాడు. దీంతోపాటు సినిమాల్లోనూ నటించాడు. కానీ ఏ మూవీ ఆయనకు బ్రేక్‌ ఇవ్వలేదు. స్టార్‌ హీరోలందరి సినిమాల్లో కీలక పాత్రలు, చిన్న రోల్స్ లో మెరిశాడు. కానీ ఆయన్ని గుర్తించలేదు. ఈ నేపథ్యంలో `బిగ్‌ బాస్‌ తెలుగు 2`లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. సెలైంట్‌గా స్టార్ట్ అయి ఆ తర్వాత పుంజుకున్నాడు. తన యాటిట్యూడ్‌, ఆట తీరు నచ్చి ఆడియెన్స్ విన్నర్‌ని చేశారు. బిగ్‌ బాస్‌ 2 విన్నర్‌గా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు కౌశల్‌. 
 

36

ఆ సమయంలో `కౌశల్‌ ఆర్మీ` సోషల్‌ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అనేక సెలబ్రిటీలను టార్గెట్‌ చేశారు. దీనిపై కౌశల్‌ మీడియా వేదికగా వివరణ ఇచ్చాడు. కొన్ని రోజులపాటు ఈ వివాదం నడిచింది. ఆ తర్వాత ఇక కౌశల్‌ సినిమాలు చేయబోతున్నాడు, ఆఫర్లు వస్తున్నాయని అన్నారు. ఇక కౌశల్‌ లైఫ్‌ టర్న్ అయ్యిందన్నారు. కానీ అలా జరగలేదు. సడెన్‌గా కనిపించకుండా పోయాడు కౌశల్‌. ఇప్పుడు బిగ్‌ బాస్‌ సమయంలో మళ్లీ మీడియా ముందుకు వస్తున్నాడు. అంతేకాదు అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేస్తున్నాడు. 
 

46

తాజాగా ఓయూట్యూబ్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు కౌశల మందా. తాజా బిగ్‌ బాస్‌ సీజన్‌పై, పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్, ఆట తీరు వంటి వాటిపై ఆయన రియాక్ట్ అయ్యాడు. ఇక ఈ సందర్భంగా తన గురించి వివరణ ఇచ్చాడు. ఈ గ్యాప్‌కి కారణమేంటో చెప్పారు. బిగ్‌ బాస్‌ షో అయిపోయాక తనని అభిమానించి, తనకోసం పనిచేసిన వారిని కలవడానికి వెళ్లినట్టు తెలిపారు. దాదాపు ఎనిమిది నెలలపాటు అభిమానులు, శ్రేయోభిలాషులతోనే గడిపానన్నారు. పర్సనల్‌గా వారితో టైమ్‌ కేటాయించినట్టు చెప్పారు కౌశల్‌. 
 

56

ఆ తర్వాత సినిమాలు చేయాలని కథలు విన్నానని, ఓకే అనుకునే లోపే కరోనా వచ్చిందట. దీంతో బ్రేక్‌లు పడినట్టు తెలిపారు. కానీ ఇటీవల మూడు సినిమాల్లో నటించినట్టు చెప్పాడు. అవి అంతగా ఆడలేదన్నారు. ఈ సందర్భంగానే ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు తెలిపారు. ఓ పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నానని, సుమారు 250కోట్లతో ప్రాజెక్ట్ ఓకే అయ్యిందన్నారు. అయితే ఇందులో టాలీవుడ్‌ చాలా మంది హీరోలు ఉంటారని, ఇందులో తాను కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్టు చెప్పాడు కౌశాల్‌. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో భాగం కావడం సంతోషంగా ఉందని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రాబోతుందన్నారు. 
 

66

లేట్‌ అయినా పర్లేదు మంచి సినిమాతో రావాలి, తనని అభిమానించే వారిని హ్యాపీ చేయాలని కొంత గ్యాప్‌ తీసుకున్నట్టు తెలిపారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడానికి ముందు మరో సినిమాకి కమిట్‌ అయ్యాడనని తెలిపారు. మలయాళంలో హిట్‌ అయిన మూవీని తెలుగులో `రైట్‌` పేరుతో రీమేక్‌ చేస్తున్నామని, తాను హీరోగా నటిస్తున్నట్టు తెలిపారు. ఇక కౌశల్‌ ఆర్మీ పై స్పందిస్తూ, తాను ఆ తర్వాత యాక్టివ్‌గా లేకపోవడం వల్ల, సినిమాలు చేయలేకపోవడం వల్ల ఆ ఫ్యాన్స్ ని కంటిన్యూ చేయలేకపోయానని తెలిపారు. ఇకపై మళ్లీ వారి మనసులు గెలుచుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు కౌశల్‌ మందా. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories