రామ్ చరణ్ - అల్లు అర్జున్ కలిసిపోయారా? అసలు ఊహించని పని చేశారే!

First Published | Dec 26, 2023, 1:26 PM IST

అల్లు అర్జున్-రామ్ చరణ్ మధ్య గొడవలు జరుగుతున్నాయనే వాదన చాలా కాలంగా ఉంది. అందుకు వారి ప్రవర్తన కారణమైంది. కాగా ఈ మెగా హీరోలిద్దరూ కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న నేపథ్యంలో కొత్త చర్చ మొదలైంది... 
 

Ram Charan - Allu Arjun

అల్లు-కొణిదెల కుటుంబాల మధ్య దూరం పెరిగిందనే వాదన గత రెండేళ్లుగా ఉంది. ఈ పుకార్లను చిరంజీవి, అల్లు అరవింద్ ఖండించారు. అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు పడటం లేదని. కోల్డ్ నడుస్తుందని కథనాలు వెలువడ్డాయి. అందుకు వాళ్ళ ప్రవర్తన కారణమైంది. 
 

Ram Charan - Allu Arjun

రామ్ చరణ్ కి అల్లు అర్జున్ సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెప్పలేదు. రామ్ చరణ్ అల్లు అర్జున్ కి చెప్పాడు కానీ పొడిపొడిగా చెప్పాడు. అదే రోజు పుట్టినరోజు జరుపుకున్న అఖిల్ అక్కినేనికి చరణ్ వాళ్ళు కలిసున్న ఫోటో షేర్ చేసి చాలా ప్రత్యేకంగా చెప్పాడు. 
 


Ram Charan - Allu Arjun

చరణ్ బర్త్ డే విషెష్ కి సరైన రిప్లై ఇవ్వని అల్లు అర్జున్.. ఎన్టీఆర్ తో సరదా చాట్ చేశాడు. ఎన్టీఆర్ 'పార్టీ లేదా పుష్పా?' అని కామెంట్ చేయగా... 'వస్తున్నా', అంటూ రిప్లై ఇచ్చాడు. ఇవి రెండు వారి అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పుష్ప 2, దేవర ఐకానిక్ డైలాగ్స్. 
 

Ram Charan - Allu Arjun

తప్పదు అనుకుంటే తప్ప అల్లు అర్జున్, రామ్ చరణ్ ఎదురుపడటం లేదు. వరుణ్ తేజ్ బ్యాచ్ లర్ పార్టీ మెగాస్టార్ ఇంట్లో జరిగింది. దానికి అల్లు అర్జున్ హాజరు కాలేదు. తన ఇంట్లో మరలా అల్లు అర్జున్ వరుణ్-లావణ్యల బ్యాచిలర్ పార్టీ నిర్వహించాడు. దానికి చరణ్ హాజరు కాలేదు. 
 

Ram Charan - Allu Arjun


పుష్ప మూవీతో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ నేరుగా చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ రోజు రామ్ చరణ్ ఇంట్లో లేడు. వీరిద్దరికీ పడటం లేదు. మాక్సిమమ్ ఒకరినొకరు అవైడ్ చేయాలని చూస్తున్నారనే టాక్ ఉంది. 
 

Ram Charan - Allu Arjun

అసలు అల్లు అర్జున్ మెగా హీరో అనే ట్యాగ్ నుండి బయటకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకే అల్లు అర్జున్ ఆర్మీ అనే ప్రత్యేక ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తున్నారట. ఆ మధ్య విజయవాడలో జరిగిన మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్ లో ఒకరు అల్లు అర్జున్ మెగా హీరో కాదు. అతన్ని ఇక మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని మాట్లాడాడు. అది వివాదాస్పదం అయ్యింది. తర్వాత అతడు సారీ చెప్పాడు. 
 

Ram Charan - Allu Arjun

ఈ పరిణామాల నేపథ్యంలో రామ్ చరణ్-అల్లు అర్జున్ లకు ఒకరంటే మరొకరికి పడటం లేదు. అందుకే ఒకరికి మించి మరొకరు ఎదగాలని చూస్తున్నారని, గౌరవాల విషయంలో పోటీపడాలని అనుకుంటున్నారనేది టాలీవుడ్ టాక్. 
 

Ram Charan - Allu Arjun

ఈ ఊహాగానాల మధ్య అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి క్రిస్మస్ జరుపుకున్నారు. డిసెంబర్ 25 రాత్రి జరిగిన క్రిస్మస్ పార్టీలో మెగా ఫ్యామిలీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. అల్లు ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు శిరీష్ పాల్గొన్నారు. 

Ram Charan - Allu Arjun

ఇక గ్రూప్ ఫోటోలో అల్లు అర్జున్ - రామ్ చరణ్ పక్కపక్కనే నిల్చున్నారు. దీంతో వీరి మధ్య విబేధాలు తొలగాయా? ఇద్దరూ కలిసి పోయారా? లేక అలా నటిస్తున్నారా? అనే చర్చ మొదలైంది. అయితే అల్లు అర్జున్ , చరణ్ మధ్య గొడవలు ఉన్నాయనే దానిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఊహాగానాలు మాత్రమే... 

Latest Videos

click me!