కెమెరా కవర్ చేసి వరండాలోనే వాష్ రూమ్ కి వెళ్లిన ఇంటి సభ్యులు...బిగ్ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్..!

First Published | Sep 22, 2020, 11:19 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా మూడవ వారంలోకి అడుపెట్టింది. ఎపిసోడ్ 17లో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంటి సభ్యులను రోబోలు, హ్యూమన్స్ అని రెండు టీం లు గ విభజించిన బిగ్ బాస్ వారికి టాక్స్ ఇవ్వడం జరిగింది. 

బిగ్ బాస్ ఎపిసోడ్ 17 భారతీయుడు మూవీలోని మాయ మచీన్ద్రా సాంగ్ తో ఆహ్లాదంగా మొదలుపెట్టాడు బిగ్ బాస్. సాంగ్ కి ఇంటి సభ్యులు ఉత్సాహంగా డాన్స్ వేయడం జరిగింది. ఇక ఉదయాన్నే మోనాల్ వచ్చిరాని తెలుగు రైమింగ్స్ తో ఇంటి సభ్యులను అలరించారు. ఆమె చెప్పిన బావ బావ పన్నీరు రైమ్ ని ఇంటి సభ్యులు బాగా ఎంజాయ్ చేశారు.
ఇక బిగ్ బాస్ హౌస్ లో ఫిజికల్ గేమ్స్ మొదలుపెట్టాడు.ఇంటి సభ్యులను హ్యూమన్స్,రోబోలుగా విభజించిన బిగ్ బాస్ వీరి మధ్య పోటీ పెట్టారు. ఇంటిలోని ఫుడ్ , వాష్ రూమ్స్ రోబోల అధీనంలో ఉండేలా చేసిన బిగ్ బాస్, హ్యూమన్స్ టీం రోబోలను ఛార్జ్ కాకుండా అడ్డుకోవాలని చెప్పారు

హ్యూమన్ టీమ్ గా నోయెల్, అఖిల్, సోహైల్, దివి, మెహబూబ్,రాజశేకర్, సుజాతఉండగా రోబో టీమ్ లోగంగవ్వ, దేవి నాగవల్లి,అభిజిత్, అవినాష్, లాస్య, ఆరియానా,కుమార్ సాయి, హారికలను నిర్ణయించారు.
హ్యూమన్ టీమ్ మొదట్లోరోబో టీమ్ పైచేయి సాధించారు. ఈ గేమ్ లో రోబోలుకుండను కాపాడుకోవాల్సి ఉండగా, హ్యూమన్ టీం కొండను చేజిక్కించుకొని బద్దలు కొట్టారు. ఈ టాస్క్లో కొంచెం ఫిజికల్ ఫైట్ కూడా జరిగింది.
కెమెరాలు కవర్ చేయడకూడదు అని బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక రాజశేఖర్ మాస్టర్ సిగరెట్ కోసం బాగా ఇబ్బంది పడ్డారు. ఈ గేమ్ అంత ఆసక్తిగా ఏమి సాగలేదు. హ్యూమన్టీం ఆకలితో ఇబ్బందిపడ్డారు. వాష్ రూమ్స్ కి వెళ్లే అవకాశం కూడా లేక లేడీ కంటెస్టెంట్స్ ఇబ్బందులు అనుభవించారు.
అందుకే బిగ్ బాస్ కొంచెం ఫీజికల్ గా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని హ్యూమన్స్ గా, వీక్ కంటెస్టెంట్స్ ని రోబోలుగా నిర్ణయిచడం జరిగింది. ఈ గేమ్ రేపటి కూడా కొనసాగుతుండగా మరింత మజా కొంచెం ఫైట్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Latest Videos

click me!