Bheemla Nayak in sankranti: ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా?.. పండక్కి `భీమ్లా నాయక్‌` మోత మోగనుందా?

First Published | Dec 28, 2021, 11:36 PM IST

ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించలేం. ఇండియన్‌ బిగ్గెస్ట్ ఫిల్మ్ `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం స్థానంలో పవన్‌ `భీమ్లా నాయక్‌` రాబోతుందనే వార్తలు తెరపైకి రావడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. 

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన `భీమ్లానాయక్‌` చిత్రం మొదట సంక్రాంతి బరిలో నిలిచింది. జనవరి 12న విడుదల చేయాలని భావించారు. ఆ రకంగానే సినిమా పనులు పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది యూనిట్‌. అయితే `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌` లాంటి పాన్‌ ఇండియా చిత్రాల కోసం `భీమ్లా నాయక్‌`ని వాయిదా పడబోతుందనే వార్తలొచ్చినా, వాటిని ఖండిస్తూ వచ్చిన నిర్మాతలు ఎట్టకేలకు తలొగ్గారు. దీంతో సినిమా ఫిబ్రవరి 25కి వెళ్లిపోయింది. దీంతో `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌`లకు కాస్త రిలీఫ్‌నిచ్చింది. 
 

`భీమ్లా నాయక్‌` వాయిదా పడటంతో `ఆర్‌ఆర్‌ఆర్‌`కి, `రాధేశ్యామ్‌`కి మధ్య వారం గ్యాప్‌ ఉంది. ఈ లోపు పిండుకోవాల్సినంత రాజమౌళి సినిమా పిండుకుంటుంది. ఆ తర్వాత `రాధేశ్యామ్‌`తో కలిసి మరికొంత కలెక్షన్లని రాబట్టుకుంటుంది. సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తే ఆ దూకుడు రెండు వారాలు కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. `రాధేశ్యామ్‌` ఫలితంపై `ఆర్‌ఆర్ఆర్‌` కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి. ప్రభాస్‌ సినిమాపై కూడా భారీ అంచనాలుండటంతో రెండో వారంలో ఈ రెండు చిత్రాల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని చెప్పొచ్చు. తమిళంలోనూ జనవరి 14న అజిత్‌ `వాలిమై` ఉండటంతో అక్కడ గట్టిగానే ఎఫెక్ట్ పడుతుంది. తెలుగులోనూ దీని ప్రభావం ఉండబోతుందని చెప్పొచ్చు. 
 


ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు పవన్‌ మళ్లీ సంక్రాంతి బరిలో దిగబోతున్నాడని తెలుస్తుంది. `భీమ్లా నాయక్‌` సంక్రాంతికే విడుదల కాబోతుందనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దానికి కారణం.. `ఆర్‌ఆర్‌ఆర్‌` వాయిదా అనే న్యూస్‌. కరోనా ప్రభావం పెరగడం, ఢిల్లీలో థియేటర్లు మూతపడటం, మహారాష్ట్రలో కరోనా ఆంక్షలు, నైట్‌ కర్ఫ్యూ ఉండటం, ఏపీలో టికెట్ల రేట్ల ఇష్యూ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం, దీనికి తోడు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఇంకా పర్మిషన్‌ రాలేదు. ఇప్పట్లో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా మళ్లీ వాయిదా పడుతుందా అనే వార్తలు ఊపందుకున్నాయి. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` వాయిదా అనే వార్తతో `భీమ్లా నాయక్‌` సంక్రాంతి పందెంలోకి దిగబోతున్నాడనే వార్త తెరపైకి వచ్చింది. `ఆర్‌ఆర్‌ఆర్‌` వల్లే `భీమ్లా నాయక్‌` వాయిదా పడింది. కానీ ఇప్పుడు ఆ సినిమానే రిలీజ్‌ కాకపోతే, `భీమ్లా నాయక్`కి ఎలాంటి అడ్డంకులు ఉండవు. పవన్‌ సినిమా, `రాధేశ్యామ్‌` రెండూ విడుదలకు స్కోప్ ఉంది. రెండింటికి మంచి స్పేస్‌ ఉంటుంది. అందుకోసమే `భీమ్లా నాయక్‌` నిర్మాతలు ఆలోచనలో ఉన్నారని సమాచారం. 

తాజాగా `భీమ్లా నాయక్` ప్రొడ్యూసర్‌ సూర్యదేవరనాగవంశీ ఈ రోజు ఓ బ్లాస్టింగ్‌ ట్విట్‌ చేశారు. ఇందులో రేపు ఉదయం సినిమాకి సంబంధించి ఓ సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు. పవర్‌ఫుల్‌ అప్‌డేట్‌తో రాబోతున్నట్టు వెల్లడించారు. బుధవారం పదకొండు గంటలకు ఈ సినిమా నుంచి అప్‌డేట్‌ని ప్రకటించనున్నారు. మరి ఇంతకి ఆయన పంచుకునే పవర్‌ఫుల్‌ అప్‌డేట్‌ ఏంటనేది ఆసక్తిగా మారింది. `ఆర్‌ఆర్‌ఆర్‌` వాయిదా రూమర్స్ నేపథ్యంలో ఆయన ప్రకటించే అప్‌డేట్‌ సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 

అయితే `ఆర్‌ఆర్ఆర్‌` జనవరి 7 విడుదల లక్ష్యంగా చిత్ర బృందం బ్యాక్‌ టూ బ్యాక్‌ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. జోరు ప్రమోషన్‌ చేస్తున్న క్రమంలో మళ్లీ వాయిదా వేసే సాహసం చేయబోరని చెప్పొచ్చు. మరి ఇందులో నిజమెంతా? అసలు విడుదల వరకు ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. అదే సమయంలో `భీమ్లా నాయక్‌` పండక్కి రాబోతుందనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం విశేషం. 

also read: RRR-Radheshyam: ముంచుకొస్తున్న ముప్పు.. వందల కోట్లు వదులుకోవాల్సిందేనా? రాజమౌళి, ప్రభాస్‌లో గుబులు ?

Latest Videos

click me!