RRR-Radheshyam: ముంచుకొస్తున్న ముప్పు.. వందల కోట్లు వదులుకోవాల్సిందేనా? రాజమౌళి, ప్రభాస్‌లో గుబులు ?

First Published | Dec 28, 2021, 10:17 PM IST

దేశ వ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఓ పెద్ద ముప్పు ముంచుకొస్తుంది. జనాల్లోనే కాదు, చిత్ర పరిశ్రమలోనూ ఆందోళన ప్రారంభమవుతుంది. ముఖ్యంగా `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌` చిత్ర యూనిట్స్ లో గుబులు పట్టుకుంటుంది. 
 

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా జనవరి 7న విడుదలకు సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటించిన మల్టీస్టారర్‌ కావడం, జక్కన్న సినిమా కావడం,అలియాభట్‌, అజయ్‌ దేవగన్‌ నటించడంతో దీనిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అంచనాలను `ఆర్‌ఆర్‌ఆర్‌` ట్రైలర్‌ మరింతగా పెంచింది. ఆకాశమే హద్దుగా మార్చింది. దీంతో ఇడియన్‌ ఆడియెన్స్ ఈసినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. రాజమౌళి, తారక్‌, చరణ్‌ కూడా సినిమా ప్రమోషన్‌ పరంగానూ భారీగా చేస్తున్నారు. నార్త్ మార్కెట్‌ టార్గెట్‌గా ముంబయిలో వారం రోజులకుపైగా ప్రమోషన్‌
కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు సౌత్‌లో ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. సోమవారం చెన్నైలో `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. 

మరోవైపు పాన్‌ ఇండియా నుంచి గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయారు ప్రభాస్‌. ఆయన నటించిన `రాధేశ్యామ్‌` కూడా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకుంది. ఇదొక ఎపిక్‌ లవ్‌ స్టోరీగా ఉండబోతుందనే విషయాన్ని స్పష్టం చేసింది. అంతేకాదు ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కూడా గ్రాండ్‌గా సక్సెస్‌ కావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక అన్ని భాషల్లోనూ ప్రమోషన్‌ కార్యక్రమాలకు రంగం సిద్ధం చేస్తుంది యూనిట్‌. రెండేళ్ల తర్వాత ప్రభాస్‌ని చూసేందుకు గ్లోబల్ ఆడియెన్స్ సైతం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.


ఇలా అటు `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌, ఇటూ `రాధేశ్యామ్‌` టీమ్‌ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండు చిత్రాలకు అనేక సవాళ్లు ఎదురవుతున్నారు. కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మహమ్మారి ముప్పు ముంచుకొస్తుంది. ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్‌, ఒమిక్రాన్‌ వేరియెంట్‌లు వరుసగా ఇండియాలో పెరిగిపోతున్నారు. ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నా, రానున్న రోజుల్లో మాత్రం ఈ వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉండబోతుందనే సంకేతాలనిస్తున్నాయి. 
 

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టికెట్ల రేట్ల తగ్గుదల పెద్ద సినిమాలకు భారీ నష్టాన్ని మిగుల్చుతున్నాయి. ఇప్పుడున్న రేట్లతో కలెక్షన్లకి భారీగా గండిపడబోతుందనే విషయం ఇప్పటికే `అఖండ`, `పుష్ప` చిత్రాలవిషయంలో స్పష్టమైంది. ఈ చిత్రాలు సక్సెస్‌ టాక్‌ తెచ్చుకున్నా.. ఏపీలో మాత్రం చాలా చోట్ల ఇంకా బ్రేక్‌ ఈవెన్‌ కాలేదనే టాక్‌ వినిపిస్తుంది. అందుకు కారణం టికెట్ల రేట్లు తక్కువగా ఉండటమే అని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ప్రభుత్వ పెద్దలతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నిర్వహించిన మీటింగ్‌లోనూ ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం టికెట్‌ రేట్ల గురించి  ఆలోచిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆ కమిటీకి నాలుగు వారాల గడువిచ్చారు. ఆ రిపోర్ట్ వచ్చి, దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే లోపు `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌` చిత్రాలు విడుదలై పాతపడిపోతాయి. ఈ లెక్కన ఏపీలో ఇప్పటి పరిస్థితులకు ఈ రెండు సినిమాలు విడుదల టైమ్‌ వరకు ఎలాంటి మార్పు ఉండబోదని అర్థమవుతుంది. 

మొత్తంగా ఏపీలో తగ్గిన టికెట్ల రేట్ల కారణంగా సినిమాలు భారీగా నష్టపోవాల్సిందే. `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌` చిత్రాలకు దాదాపు వంద కోట్ల(తలా యాభై) వరకు నష్టం రావచ్చని ట్రేట్‌ వర్గాల అంచనా. కరోనా
ప్రభావం పెరిగితే ఈ నష్టం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. దీనికితోడు వైరస్‌ ప్రభావం బాలీవుడ్‌ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపబోతుందనే టాక్‌ వినిపిస్తుంది. ఈ వారం విడుదల కావాల్సిన `జెర్సీ`(తెలుగు రీమేక్‌)
సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. వైరస్‌ పెరుగుతున్న కారణంగా ముంబయిలో నైట్‌ కర్ఫ్యూలు పెడుతుంది ప్రభుత్వం. దీంతో ఓ షో తగ్గిపోతుంది. మరోవైపు వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మన
సినిమాలు విడుదలయ్యే సమయానికి ఆంక్షలు మరింత కఠినతరం అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు.. `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌` చిత్రాలకు బాలీవుడ్‌ అతిపెద్ద మార్కెట్‌. ఇక్కడి నుంచే సుమారు మూడు వందల
కోట్లు రాబట్టాలని రెండు చిత్రాలు భావిస్తున్నాయి. అందుకోసం ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నాయి. ఇప్పుడు ఏమాత్రం తేడా వచ్చిన వందల కోట్లు నష్టపోవాల్సిందే. 

దీనికితోడు ఢిల్లీలో వైరస్‌ ప్రభావంతో థియేటర్లు మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రాత్రి నుంచే ఆంక్షలు అమలవుతున్నాయి. పెరుగుతున్న వైరస్‌ కేసుల రీత్యా ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  ఇది కూడా `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌` చిత్రాలపై ప్రభావాన్ని చూపబోతుంది. ఎందుకంటే `బాహుబలి 2` చిత్రం ఢిల్లీ సెక్టార్‌లో సుమారు వంద కోట్ల వరకు కలెక్షన్లని రాబట్టిందని అప్పటి ట్రేడ్‌ వర్గాల నుంచి అందిన సమాచారం. నాలుగేళ్ల క్రితమే ఈ స్థాయి కలెక్షన్లు వచ్చాయంటే ఇప్పుడు రాజమౌళి అక్కడి నుంచి ఏకంగా సుమారు రూ.150 నుంచి 200కోట్లు ఆశిస్తున్నారని చెప్పొచ్చు. అలాగే ప్రభాస్‌ కూడా తన `రాధేశ్యామ్‌` సినిమాకి భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు గుబులు పుట్టిస్తుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌` యూనిట్స్ లో ఆందోళన కలిగిస్తుంది. 

వీటితోపాటూ కరోనా పెరిగితే కేరళాలోనూ ఎఫెక్ట్‌ అవుతుంది. అక్కడ కూడా కలెక్షన్లకి గండిపడనుంది. ఇవన్నీ చూస్తుంటే రాజమౌళి `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రానికి, ప్రభాస్‌ నటించిన `రాధేశ్యామ్‌` చిత్రానికి విడుదల వరకు ముళ్ల బాటే అని చెప్పొచ్చు. ఇన్ని సవాళ్ల మధ్య సినిమాలు విడుదలవుతాయా? పోస్ట్ పోన్‌ అవుతాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనా కరోనా పెరగడం, సినిమాలు వాయిదా పడటమనేది చిత్ర పరిశ్రమకి తీరని నష్టం. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమకి కోలుకోలేని నష్టాన్నిస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. లాక్‌డౌన్‌ లాంటి పరిస్థితులు వస్తే సగం ఇండస్ట్రీ ఖాళీ అయిపోతుంది, వేల మంది కార్మికులు, అలానే నిర్మాతలు రోడ్డున పడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. సాధారణ ప్రజలు సైతం తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలతో కరోనాని కట్టడి చేయాలని కోరుకుందాం. 

also read: Bheemla Nayak in sankranti: ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా?.. పండక్కి `భీమ్లా నాయక్‌` మోత మోగనుందా?
 

Latest Videos

click me!