దుర్గవ్వకు సినిమాల్లో ఇదే తొలిపాట కాదు. గతంలోనూ ఆమె తెలుగుతో పాటు మరాఠీ చిత్రాల్లోనూ జానపదాలు పాడి ఆకట్టుకుంది.మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ భర్త రాజయ్య చాలా ఏళ్ల క్రితమే మరణించాడు. ఆమెకు కుమార్తె శైలజ, కుమారుడు ప్రభాకర్ ఉన్నారు. నిరుపేద కావడంతో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేది. వరినాట్లు, పొలం పనులకు వెళ్లినప్పుడు దుర్గవ్వ తనకు వచ్చిన జానపద పాటలు పాడేది. తల్లి టాలెంట్‌ను గుర్తించిన శైలజ ఆమె పాటలను వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా వైరల్ అయ్యాయి.