Bheemla Nayak Controversy: భీమ్లా నాయక్ పై దగ్గుబాటి ఫ్యాన్స్ అసంతృప్తి...?

Published : Feb 18, 2022, 10:28 PM IST

కరోనా ఇబ్బందులు చిన్నగా క్లియర్ అవ్వడంతో.. చాలా గ్యాప్ తరువాత రిలీజ్ అవుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్. అయితే ఈ సినిమాపై మాత్రం  దగ్గుబాటి ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారట. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

PREV
18
Bheemla Nayak Controversy: భీమ్లా నాయక్ పై దగ్గుబాటి ఫ్యాన్స్ అసంతృప్తి...?

ఎట్టకేళకు భీమ్లా నాయక్ రిలీజ్ కాబోతోంది. ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసిన సినిమా చాలా కాలం గ్యాప్ తరువాత రీలీజ్ కు రెడీ చేస్తున్నారు. పిబ్రవరి 25న సినిమా రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.సెన్సార్ కూడా అయిపోయి.. యూఏ సర్టిఫికెట్ సాధించింది మూవీ. అయితే ఈ సినిమా విషయంలో అన్ని ఇబ్బందులు క్లియర్ అయ్యాయి అనుకున్న టైమ్ లో మరో విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమాపై ఆ ప్రభావం గట్టిగానే కనిపించేలా ఉంది.

28

ఇంతకీ అసలు కథేంటంటే.. ఈ మూవీ మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ నుంచి తీసుకున్నారు. మలయాళంలో బిజూ మీనన్ పోషించిన పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారు. ఇక పృధ్విరాజ్ సుకుమారన్ నటించిన  హవాల్ధార్ పాత్రలో రానా దగ్గుబాటి నటించారు.

38

అయితే మలయాళ సినిమాలో ఈ రెండు పాత్రలకు సమానమైన స్థానం ఉంటుంది. ఇద్దరు హీరోలతో సినిమా మల్టీ స్టారర్ గా మంచి సక్సెస్ సాధించింది. అక్కడ ఆరెండు పాత్రలకు ఇపార్టెన్స్ ఉండటమే కాదు. సమఉజ్జీలుగా పోటా పోటీ నటన ప్రదర్శించారు మలయాళ హీరోలు. దాంతో ఈ ఇద్దరికి ఈ సినిమాతో ఇమేజ్ భారీగా పెరిగిపోయింది

48

అయితే తెలుగు సినిమాకు వచ్చే సరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన నెటివిటీకి తగ్గట్టు కథ మాడంతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోలో సినిమా ఇది అనే భావన కలిగేలా భీమ్లా నాయక్ ను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. అంతే కాదు పవర్ స్టార్ క్యారెక్టర్ మాత్రమే కలిసొచ్చేలా భ్లీమ్లా నాయక్ అన్న పేరు పెట్టినప్పటి నుంచీ రానా ఫ్యాన్స్ డల్ అయ్యిపోయినట్టు తెలుస్తొంది.

58

అసలు భీమ్లా నాయక్ సినిమాను మల్టీ స్టారర్ సినిమాగా గుర్తించకుండా.. పవన్ సోలో సినిమా అన్నట్టుగా చూపిస్తున్నారు. అంతే కాదు సినిమా ప్రమోషన్లలో కూడా రానా ఇన్వాల్మెంట్ లేకపోవడంతో రానా ప్యాన్స్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.ఇప్పటి వరకూ రిలీజ్ అయిన అప్ డేట్స్ లో రానా టీజర్ తప్పించీ ఇంకేమి ఇవ్వలేదు. అందులో కూడా ఎక్కువగా భీమ్లా నాయక్ ను పొగడటానికి టైమ్ ఇచ్చారు.

68

ఇక ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను చూస్తుంటే రానాను కంప్లీట్ గా సైడ్ చేసి.. చిన్న పాత్రగా కుందించారేమో అన్న అనుమానాన్ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. త్వరలో ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. అందులో అయినా రానా పాత్రకు సంబంధించి సాలిడ్ గా ఏమైనా ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నారు.

78

ఇప్పటి వరకూ భీమ్లా నాయక్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటున్నారే తప్ప ... మల్టీ స్టారర్ గా గుర్తించడం లేదు. మరి సినిమాలో అయినా రానా క్యారెక్టర్ విషయంలో సంతృప్తి పరుస్తారా లేక.. ఏదో ఉన్నాడు అనిపించేలా పెట్టారా అనేది సినిమా రిలీజ్ తరువాత తెలుస్తుంది. కాని ఈ విషయంలో మాత్రం దగ్గుబాటి ఫ్యాన్స్ కోపంగా ఉన్నట్టు సమాచారం. సినిమాపై కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది.

88

సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన భీమ్లా నాయక్ మూవీకి మాటలు,స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. తమన్ ఈసినిమాకు మ్యూజిక్ చేయగా..సితారా ఎంటర్టైర్మెంట్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈమూవీలో పవన్ సరసన నిత్యా మీనన్ నటించగా.. రానా జోడీగా సముక్తా మీనన్ నటించించి.

click me!

Recommended Stories