అది నాన్నంటే.. తండ్రి కొడుకుల ప్రేమను చూపించిన సినిమాలు.. హృదయాన్ని కదిలించే చిత్రాలివే..

First Published | Dec 10, 2023, 2:01 PM IST

రీసెంట్ గా ‘యానిమల్’ సినిమా వచ్చి థియేటర్లలో దుమ్ములేపుతోంది. యాక్షన్, వాయిలెన్స్ తోపాటు తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ ను కూడా చూపించారు. ఈ క్రమంలో తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన తండ్రి - కొడుకుల సినిమాల గురించి తెలుసుకుంది.

విక్టరీ వెంకటేశ్ నటించిన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ (AMAV) అంటే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఇందులో కోట శ్రీనివాస్, వెంకటేశ్ మధ్య జరిగే సన్నివేశాలు ఇప్పటికీ ఆడియెన్స్ మదిలో ఉంటాయి. మరీ ముఖ్యంగా ఒక తండ్రి తన కొడుకు ఉద్యోగం చేస్తే ఎంత సంతోష పడుతాడోచూపించారు. తండ్రి మరణించాక కొడుకు ఎంతలా కుమిలిపోయాడో చూస్తే ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు. తండ్రి కొడుకులపై వచ్చిన సినిమాల్లో ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. 2007లో విడుదైలంది. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. త్రిష కథనాయిక. 

తమిళ స్టార్ సూర్య (Suriya) నటించిన  ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ (Surya Son of Krishnan)  ఆయన అభిమానులకు ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. తండ్రిగా, కొడుకుగా సూర్య పెర్ఫామెన్స్ ఇప్పటికీ ఫ్యాన్స్ ను కదిలిస్తుంది. మత్తుకు అలవాటైన కొడుకును మార్చే తండ్రి పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చూపించిన బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. 2008లో ఈ చిత్రం విడుదలైంది. సిమ్రాన్, సమీరా రెడ్డి హీరోయిన్లు. గౌతమ్ వసుదేవ్ మీనన్ దర్శకుడు.


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  నటించిన ‘డార్లింగ్’ మూవీలో తండ్రి, కోడుకుల మధ్య ప్రేమను చాలా చక్కగా చూపించారు. ఎమోషన్ సీన్స్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రేమ, త్యాగం, ఫన్నీ సన్నివేశాలు ఇప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ ఇష్టపడుతుంటారు. 2010లో ఈ చిత్రం విడుదలైంది. ఏ కరుణాకరన్ దర్శకత్వం వహించారు. అలాగే ‘రెబల్’లోనూ తండ్రి, కొడుకుల బంధాన్ని చూపించారు.  
 

విక్టరీ వెంకటేశ్, మహేశ్ బాబు మల్టీస్టారర్ కాంబోలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కూడా తండ్రి కొడుకులను మంచి విషయాలను బోధించే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.  2013లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ అద్భుతంగా నటించారు. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’లో తండ్రి పరువు, మర్యాదలను కాపాడేందుకు కొడుకు ఎంతలా కష్టపడుతాడో చూపించారు త్రివిక్రమ్. 2016లో వచ్చిన ఈ చిత్రంలోని సన్నివేశాలు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. డైలాగ్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ‘అలా వైకుంఠపురంలో’లోనూ తండ్రి కోసం నిలబడ్డ కొడుకుగా అల్లు అర్జున్ చక్కగా నటించారు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)  సుకుమార్ కాంబోలో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో..’  చిత్రం కూడా తండ్రికొడుకుల ప్రేమతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో విడుదలైనప్పటికీ తండ్రిని పడగొట్టిన శత్రువుపై రివేజ్ తీసుకోవడం ఆకట్టుకుంటుంది. 2016లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ అభిమానులు ఇష్టపడుతారు. ఇలా టాలీవుడ్ లో మరిన్ని చిత్రాలు కూడా వచ్చాయి. 

ఇక బాలీవుడ్ లో కూడా చాలా సినిమాలు వచ్చాయి. ఆల్ టైమ్ ఫేవరెట్ గా ‘దంగల్’ అని చెప్పొచ్చు. చిత్రంలో తండ్రి తన పిల్లలను స్టార్ ప్లేయర్స్ గా మార్చేందుకు చేసిన కృషి ఎనలేనిదని చూపించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆడింది. ఇప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోతున్నారు. అమీర్ ఖాన్ నటించిన రూ.2000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబ్టటింది. 

చాలా రోజుల తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ‘యానిమల్’లోనూ తండ్రి కొడుకుల సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. Animal లో రన్బీర్ కపూర్, అనిల్ కపూర్ మధ్య సాగిన సన్నివేశాలు ఈతరం వారికి గుర్తుండిపోయేలా చేశారు. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 

Latest Videos

click me!