మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించిన భైరవం చిత్రం నేడు శుక్రవారం రోజు గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రాధా మోహన్ నిర్మించారు. గత నెలరోజులుగా భైరవం చిత్ర యూనిట్ ఒక రేంజ్ లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ చిత్రానికి బజ్ తీసుకునివచ్చారు. ప్రేక్షకులంతా ఇది మంచు మనోజ్ కి కంబ్యాక్ మూవీ కావాలని కోరుకుంటున్నారు. దాదాపు 9 ఏళ్ళ తర్వాత మంచు మనోజ్ నుంచి వస్తున్న చిత్రం ఇది.