కళ్యాణ్ రామ్ కి చాలా రోజుల తర్వాత `బింబిసార` హిట్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన `ఎమిగోస్` మిస్ ఫైర్ అయ్యింది. సూపర్ డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు `డెవిల్` చిత్రంతో వచ్చాడు. ప్రారంభం నుంచి ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్లు కంటెంట్ పరంగా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశాయి. కానీ సినిమాకి బజ్ లేదు. తాజాగా థియేటర్లకి వచ్చిన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది.
ఇదిలా ఉంటే `డెవిల్` సినిమాకి డైరెక్టర్‌ని తొలగించడానికి సంబంధించిన వివాదం చుట్టుముట్టింది. మొదట సినిమాకి నవీన్ మేడారం దర్శకుడు అని ప్రకటించారు. ఫస్ట్ లుక్ వంటి వాటిలో అతని పేరు వేశారు. సినిమాకి శ్రీకాంత్ విస్సా కథ అందించారు. మాటలు, స్క్రీన్ ప్లే ఆయనదే. అభిషేక్ నామా నిర్మించారు. ఆయన ప్రొడక్షన్‌లోనే గతంలో `బాబుబాగాబిజి` అనే సినిమాని రూపొందించాడు నవీన్ మేడారం. అతని వర్క్ నచ్చే `డెవిల్` చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు.
నిర్మాత చెప్పిన దాని ప్రకారం.. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని నవీన్ డీల్ చేయలేకపోయాడని, షూటింగ్ కి వెళ్లిన ఫస్ట్ డేని ఆ విషయం తెలిసిపోయిందన్నారు. దీంతో అతన్ని పక్కన పెట్టి తాను రంగంలోకి దర్శకత్వం వహించినట్టు చెప్పారు. తాను ఎన్నో సినిమాలను నిర్మించాను, డిస్ట్రిబ్యూట్ చేశాను, పైగా ఫైన్ ఆర్ట్స్ స్టడీ చేశాను. ఆ అనుభవంతో డైరెక్షన్ చేశానని, శ్రీకాంత్ విస్సా తాను చెప్పిన ఐడియాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే రాసుకొచ్చారని తాము ఈ సినిమాని రూపొందించినట్టు చెప్పారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు అభిషేక్ నామా.
అయితే ఎలాంటి దర్శకత్వ అనుభవం లేని మీరు `డెవిల్` సినిమాని తీశారు.. రెండు సినిమాలు తీసిన దర్శకుడు `డెవిల్`ని తీయలేకపోయాడు అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలాడు. అనుమానాలు క్రియేట్ అయ్యే సమాధానాలు తెలిపారు. ఆ తర్వాత తన పరువు తీస్తున్నారని, ట్రోల్ చేస్తున్నారని, ఫ్యామిలీని దూషిస్తున్నారంటూ నిర్మాత స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మీడియా ముందుకు రావడం ఆపేశాడు.
ఈ క్రమంలోనే దర్శకుడు నవీన్ మేడారం ఓ బహిరంగ లేఖ విడుదల చేశాడు. `డెవిల్` తన బేబీ అని, తన క్రియేషన్ నుంచి వచ్చిందని, కానీ ఈగోల కారణంగా తనని తొలగించారని, డైరెక్షన్ క్రెడిట్ ఇవ్వడం లేదని వాపోయాడు. ఎవరు ఎన్ని చెప్పినా, తానే సినిమాని 95శాతం రూపొందించినట్టు చెప్పారు. చివర్లో తనని తొలగించినట్టు చెప్పాడు. క్రెడిట్ కోసం తన ఆవేదన వ్యక్తం చేశారు.
Devil Movie Review
అయితే అసలు `డెవిల్` విషయంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమాకి పని చేసిన కొందరు `క్రూ` ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. సినిమాకి మొదట్నుంచి నవీన్ మేడారమే దర్శకుడు అని అంటున్నారు. దాదాపు సినిమా మొత్తం ఆయనే రూపొందించాడని చెబుతున్నారు. కాకపోతే డైరెక్టర్‌ని ప్రారంభం నుంచి ఇబ్బంది పెట్టారని, సరిగా చేయనివ్వలేదని అంటున్నారు. ఇందులో కెమెరామెన్ కూడా ఇన్ వాల్వ్ అయ్యారని చెబుతున్నారు.
Devil Movie Review
దర్శకుడిని తొలగించడానికి కారణం.. సినిమా ఎండింగ్‌లో ఉండగానే దర్శకుడు నవీన్‌కి మరో బ్యానర్‌లో సినిమా ఆఫర్ వచ్చిందట. ఆ సినిమాకి నవీన్ ఓకే చెప్పాడు, అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. కానీ కమిట్ మెంట్ ప్రకారం నెక్ట్స్ సినిమా కూడా తమ బ్యానర్‌లోనే చేయాలనే అగ్రిమెంట్ అభిషేక్ నామా ప్రొడక్షన్‌లో ఉందట. తన నిబంధన ఉల్లంగించడంతో మండిన నిర్మాత `డెవిల్` నుంచి తొలగించి తన పేరు వేసుకున్నట్టు తెలుస్తుంది. ఔట్ పుట్‌పై వారికి నమ్మకం వచ్చాక దర్శకుడిని తొలగించారట. అలా కొంత ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాత, రైటర్ ఆధీనంలో జరిగిందట.
Devil
మరి ఇంత జరుగుతున్నా హీరో కళ్యాణ్ రామ్ సైలెంట్‌గా ఉండటానికి కారణం ఏంటనేది చూస్తే.. దర్శకుడు కళ్యాణ్ రామ్ ఈగోని హర్ట్ చేశాడట. షూటింగ్‌లో కళ్యాణ్ రామ్ ఆవేశంలో ఆ ఫ్లోలో యాక్టింగ్ కంటిన్యూ చేస్తుంటే దర్శకుడు కట్ చెప్పేవారట. ఇలా రెండు మూడు సార్లు జరగడంతో కళ్యాణ్ రామ్ బాగా హర్ట్ అయ్యాడట. ఫర్వాలేదు ఎడిటింగ్‌లో కట్ చేసుకోమని చెప్పినా, దర్శకుడు వినకుండా యాక్టింగ్ ఫ్లోని కట్ చేసేవాడని, అందుకే హర్ట్ అయిన కళ్యాణ్ రామ్.. ఈ విషయంలో సైలెంట్‌గా ఉన్నాడని, నిర్మాత, రైటర్‌ల వైపే ఉన్నాడని అంటున్నారు.
Devil Movie Review
తాజాగా విడుదలైన సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. కథలో, స్క్రీన్‌ప్లేలో లోపాలు కనిపిస్తున్నాయి. ట్విస్ట్ లు పండకపోవడం, ల్యాగ్‌లు ఉండటం మైనస్‌గా నిలుస్తుంది. కథనంలో క్లారిటీ లేదు. కానీ డైరెక్షన్ క్వాలిటీగా ఉంది. సీన్లు బాగున్నాయి. అది అనుభవం ఉన్న దర్శకుడి వల్లే సాధ్యం. దీంతోనే నిర్మాత అభిషేక్ నామాకి ఇది సాధ్యం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలోనే నిర్మాత దొరికిపోయాడని, తాను చెప్పేది నిజం కాదని సినిమా చూస్తుంటే అర్థమవుతుందని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా `డెవిల్` డైరెక్టర్ వెనక జరిగింది ఇదే అని తెలుస్తుంది. మరి ఇందులో నిజం ఉందా? ఇది కూడా రూమరేనా? నిర్మాతని బ్యాడ్ చేసే ప్రక్రియనా? అనేది మాత్రం సస్పెన్స్.